జీవనాడి..జీవనది
ముట్టుకోకుండానే
కప్పుకున్నావు
రెండే చినుకు ముక్కలు రాలి
నాలుగే తేనే చుక్కలు జారి
మెరిక చూపులు పాకి
మెలిక తీగలుగా
పచ్చగా సాగుతూ
వెచ్చని ఊసులు
చొట్ట బుగ్గలలో చింది
చిట్టి ఆశలు మెదిలి
పెదవుల దారులలో ఒదిగి
మత్తు నడకతో కదలి
కౌగిటి వేదిక
పలికిన స్వాగతం
కలకు జీవం
కథకు జవం
అదే
జీవనాడి.
ఇదే
జీవనది.
భలే రాసారండీ
అభినందన లు