ఇంత వర్ష కాలం
చినుకు వొళ్ళు విరుచుకుని
మట్టి మాగాణిని తట్టిలేపింది.
ఆకు పచ్చని కళ్ళు
ఆశ గా మెరిసాయి.
నీటి సుక్కకు ఒళ్ళు
జలదరించింది.
తొలినాళ్ళ వానస్పర్శ
ప్రకృతిని ముస్తాబు చేసింది.
ఈ మౌన ప్రపంచం
కనిపించని క్రిమి గుప్పిట్లో దాగుంది.
మాటలు జారలేవు.
కళ్ళు తదేకంగా చూడలేవు
ముక్కు ఏ పరిమళానికి దగ్గర కాలేదు.
ఆధిపత్యం పోరు తలకెత్తుకుని
జీవాయుధాల్ని చుట్టుకుని
సమయం విస్తరణ వాదాన్ని కాంక్షిస్తూ
ఒక యుద్దానికి తెరలేపుతోంది.
దాడి
సామాన్యుడి బతుకు మీద
జరుగుతోంది.
ఇంత వర్షా కాలం
ఇన్ని ముడులు విప్పుకుని
బతుకుని ఆస్వాదించడం
కాలమనే నదికి ఎదురీదినట్లే వుంది.
Thank you so much sir
గవిడి శ్రీనివాస్ గారు కవిత బాగుందండి.. ఇంత వర్షా కాలం ఇన్ని ముడులు విప్పుకుని బతుకుని ఆస్వాదించడం కాలమనే నదికి ఎదురీదినట్టేవుంది..చక్కగా చెప్పారు. అభినందనలు…