Menu Close
Geethanjali-page-title

62

WHEN I bring to you coloured toys, my child, I understand why there is such a play of colours on clouds, on water, and why flowers are painted in tints - when I give coloured toys to you, my child. When I sing to make you dance I truly know why there is music in leaves, and why waves send their chorus of voices to the heart of the listening earth - when I sing to make you dance.

When I bring sweet things to your greedy hands I know why there is honey in the cup of the flower and why fruits are secretly filled with sweet juice - when I bring sweet things to your greedy hands.

When I kiss your face to make you smile, my darling, I surely understand what the pleasure is that streams from the sky in morning light, and what delight that is which the summer breeze brings to my body - when I kiss you to make you smile.

సీ. రంగు రంగుల బొమ్మ లంగట్లొ కొనిదెచ్చి
నీకివ్వగా,తండ్రి!నిజము తెలిసె!

వానమబ్బుల చిత్ర వర్ణమ్ము లేలని!
పొంగునేల,విరులు రంగులనని!!

ఆడించుటకు నిన్ను, పాడగా యెరుకయ్యె
రాగమ్ములాకుల దాగెననుచు

మందమారుతములు బృందగానలహరి
అవని హృదిని జేరనంపుననియు

ఆ. ఆశతోడ నీవు అరచేతులను జాపి
తీపినందుకొనగ తెలిసె తండ్రి
పూల గిన్నెలందు పొంగుతేనేలని!
కొసరి దాచు ఫలము రసములనియు!!

ఆ. నుదుటిపైన నీకు ముదమార ముద్దివ్వ,
నీదు నవ్వు తెలిపె నిజము,కన్న!!
ఆకసమున జారు ఆనందమేలని!
కదలు గాలి దాచు సుధలననియు!!

63

THOU hast made me known to friends whom I knew not. Thou hast given me seats in homes not my own. Thou hast brought the distant near and made a brother of the stranger.

I am uneasy at heart when I have to leave my accustomed shelter; I forget that there abides the old in the new, and that there also thou abidest.

Through birth and death, in this world or in others, wherever thou leadest me it is thou, the same, the one companion of my endless life who ever linkest my heart with bonds of joy to the unfamiliar.
When one knows thee, then alien there is none, then no door is shut. Oh, grant me my prayer that I may never lose the bliss of the touch of the one in the play of the many.

సీ. పరిచయమ్మే లేని పరుల నేస్తుల జేసి
యెరుగని యిండ్లలో యెడము నిచ్చి

దూరమును చెరపి చేరువగా జేసి
ఒరుని సోదరునిగా ఉంచినావు

ఇల్లు వీడునపుడు ఎంతయో దుఃఖింతు!
మమకారమందునే మరచి పోదు,
నూతనత్వము నందు పాత, యిమిడియుండు,
అందు నీదు యునికి అలరుననుచు,

ఆ. పుట్టు గిట్టు లందు, భూనభముల యందు
విడిచి పోక యెపుడు వెంటనుండి
ఎరుగ లేని వాని నెదుటనిల్పెదవోయి
ఎడద పొంగి పోవ ముడులవైచి

ఆ. అరయ, నిన్ను దెలియ పరుడెవ్వడును లేడు
మూసినిల్లు లేదు ముజ్జగముల
అన్ని జీవరాసులందు నిన్నే జూచు
ప్రేమనిమ్ము స్వామి వేడుకొందు!!

64

ON the slope of the desolate river among tall grasses I asked her, "Maiden, where do you go shading your lamp with your mantle?

My house is all dark and lonesome - lend me your light!"

She raised her dark eyes for a moment and looked at my face through the dusk. "I have come to the river," she said, "to float my lamp on the stream when the daylight wanes in the west."

I stood alone among tall grasses and watched the timid flame of her lamp uselessly drifting in the tide.

In the silence of gathering night I asked her, "Maiden, your lights are all lit - then where do you go with your lamp? My house is all dark and lonesome, - lend me your light.

She raised her dark eyes on my face and stood for a moment doubtful. "I have come," she said at last, "to dedicate my lamp to the sky." I stood and watched her light uselessly burning in the void.

In the moonless gloom of midnight, I asked her, "Maiden, what is your quest holding the lamp near your heart? My house is all dark and lonesome, - lend me your light."

She stopped for a minute and thought and gazed at my face in the dark. "I have brought mylight," she said, "to join the carnival of lamps." I stood and watched her little lamp uselessly lost among lights.

సీ. నదియొడ్డు నందొక నల్లకనుల బాల
నడిగితి‌ చీకటి యలుము వేళ

"మేలిముసుగు తోడ గాలి తెరలనాపి
ఒంటిగా దివ్వెతో ఒడ్డు చెంత

ఎందుబోదువు బాల ఈవేళ! వెలుగుతో,
మాయింట చీకట్లు తీయలేవ!!"

"పగటిపూట వెలుగు పశ్చిమాద్రిని జేర
నదిపైన దీపమ్ము వదిలి వేయ

ఆ. వచ్చితి నదికనుచు పల్కెనా పద్మాక్షి
నల్ల కనులనెత్తి నన్ను జూచి
వ్యర్థమగుచు దివ్వె వాగులోదేలగా
నిస్సహాయుడనయి నిలచి యుంటి

సీ. దీపమ్ములన్నియూ దివ్యమై వెలుగగా
ఎందుబోదువిపుడు యిల్లు విడిచి?

చీకట్లు పోకార్ప చిరుదీపమున్ నాకు
అరువీయగా రాద కరుణ జూపి?

"ఆకాశదీపమ్ము అర్పించ వచ్చితి"
అనుమానముతోడ అనియె యువిద

కొరగాని దివ్వెలో తరుగు కాంతులజూచి
పలుకుమాని అచట నిలచి యుంటి

ఆ. గుండె పైన హత్తుకొనెదవేల దివ్వె,
అమవస నిశిలోన అర్థరాత్రి?
అంధకారమలమె అంతటా మాయింట
వెలుగునింప దీపకళిక నీవ?

ఆ. "తెచ్చి యుంటి దాని దీపోత్సవమునకై"
చూచి నన్ను దెలిపె సుదతి యపుడు
వేల దివ్వెలందు వెలవెలబోయిన
ప్రమిద వంక చూచి పలుకకుంటి

65

WHAT divine drink wouldst thou have, my God, from this overflowing cup of my life?

My poet, is it thy delight to see thy creation through my eyes and to stand at the portals of my ears silently to listen to thine own eternal harmony?

Thy world is weaving words in my mind and thy joy is adding music to them. Thou givest thyself to me in love and then feelest thine own entire sweetness in me.

సీ. ఎట్టి అమృతమును ఈజీవపాత్రలో
త్రావదలచి నింపినావు స్వామి?

భువన రచన జేయు కవిసత్తమా! దాని
కాంచనెంతువొ నాదు కనులనుండి?

కర్ణరంధ్రమ్ముల కడ జీవరాగమ్ము 
అవధరింతువొ నన్ను అనుగ్రహించి?

నిఖిలనిర్మాతవు నిండినా మనసులో
అవతరింతువొ సృష్టిననుభవింప?

ఆ. పదము లల్లు నెదను పరమాత్మ నీసృష్టి,
సరిగమలను కూర్చు సంతసమ్ము!!
నీదు సర్వమొసగి, నిర్మల ప్రేమతో
మరలగొనెదవీవె, మదిని నిలిచి

66

SHE who ever had remained in the depth of my being, in the twilight of gleams and of glimpses; she who never opened her veils in the morning light, will be my last gift to thee, my God, folded in my final song.

Words have wooed yet failed win her; persuasion has stretched to her its eager arms in vain. I have roamed from country to country keeping her in the core of my heart, and around her have risen and fallen the growth and decay of my life.

Over my thoughts and actions, my slumbers and dreams, she reigned yet dwelled alone and apart. Many a man knocked at my door and asked for her and turned away in despair. There was none in the world who ever saw her face to face, and she remained in her loneliness waiting for thy recognition.

సీ. మనసుభద్రపరచు మానినీ రత్నమ్ము
తళుకు మని మెరయు తరళనేత్రి

వేకువ కాంతులు తాకలేని తరుణి
ముసుగుతీయకనుండు ముద్దరాలు

అర్పింతు నామెను అంజలి ఘటియించి
చరమగీతిగ దాచి స్వామి నీకు
----
పదగుంఫనమ్మున పట్టుబడదు ఆమె
ప్రార్థనల్ జేసినా వశము కాదు

ఆ. దేశ దేశములను తిరిగితి, ఆమెను
హృదయ కుహర మందు పదిల పరచి
కీర్తిశిఖరములను గెలుపుఓటములను
తోడునిలిచె నామె నీడవోలె

ఆ. కలల నిదురలందు కర్మయోచనలందు
పాలనమును జేసి యేలి నన్ను
ఎపుడు బ్రతికెనామె యేకాకిగా తాను
దూరమందు మెరయు తారవోలె

ఆ. అవనిలోని ప్రముఖులామెకై నాయింటి
తలుపు తట్టి వగచి తరలినారు
ఎవరు చూడలేని ఏకాంతమందు నీ
మెప్పుకొరకె వేచునిప్పుడామె!!!

67

THOU art the sky and thou art the nest as well.

O thou beautiful, there in the nest it is thy love that encloses the soul with colours and sounds and odours.

There comes the morning with the golden basket in her right hand bearing the wreath of beauty, silently to crown the earth.

And there comes the evening over the lonely meadows deserted by herds, through trackless paths, carrying cool draughts of peace in her golden pitcher from the western ocean of rest.

But there, where spreads the infinite sky for the soul to take her flight in, reigns the stainless white radiance. There is no day nor night, nor form nor colour, and never, never a word.

సీ. తలపైని గగనమ్ము తరువులో చిరుగూడు
నీదురూపమె స్వామి!  నిఖిలమంత

సౌందర్య నిలయ!  ఆ, అందాల గూటిలో
నెత్తావులను జల్లి నీదు ప్రేమ

కలరవములనిండి పలువర్ణములతో
ఆవరించెను ప్రభూ!  ఆత్మమీద
--
ముడివేసి తలనిండ పూలహారాలను
కేలదాల్చి పసిడి పూల సజ్జ

ఆ. పొద్దుపొడుపు వేళ సద్దుసేయక తాను
అరుణ కిరణ కాంతి అవని నిండ
అలరు సోనల‌ భువినభిషిక్తగా జేయ
కదలి వచ్చునపుడు ఉదయ కాంత

సీ. గోధూళి వేళలో గోపాలురందరున్
మందలతోగూడి మరలి పోవ

శాంతివీచికలను స్వర్ణకలశమందు
నింపుకొనుచు వచ్చు నెలత సంధ్య

కాని, శూన్యము లోన, కట్లు తెగి యెగురు
ఆత్మకై పరచిన అభ్రమందు

శ్వేత వర్ణమొకటె వేలసూర్యుల వలె
వెలుగుచుండు నచట నలుపు లేక

ఆ. రంగు రూపు లన్ని లయమౌనచ్చోట,
ఉదయరాత్రు లచట ఉండబోవు!
మాట, మాటలేదు మచ్చుకైనాగాని,
కడకు మిగులునచట కాంతియొకటె!!!!

68

THY sunbeam comes upon this earth of mine with arms outstretched and stands at my door the livelong day to carry back to thy feet clouds made of my tears and sighs and songs.

With fond delight thou wrappest about thy starry breast that mantle of misty cloud, turning it into numberless shapes and folds and colouring it with hues ever changing.

It is so light and so fleeting, tender and tearful and dark, that is why thou lovest it, O thou spotless and serene. And that is why it may cover thy awful white light with its pathetic
shadows.

సీ. అవనిపైకేతెంచి అరజేతులన్ జాచి
వాకిటిలో నిల్చి భానురేఖ,

నాదునిట్టూర్పులు నాగానలహరులన్
కన్నీటి ధారలన్ కరగి వైచి

నీపాదములనుండ నీటిమబ్బుగ మార్చి
నిలిపియుంచెను ప్రభూ నింగిలోన

నక్షత్రయుక్తమౌ వక్షమ్ముపై దాని
ధరియించితివి నీవు కరుణతోడ

ఆ. వేల రూపములను వేవేల రంగులన్
అంబుదంపు మేననమరె స్వామి
మసకమబ్బు మెరసి మంచపొరగ నీదు
పొంగుయెడదపైన పులకరించు

ఆ. గాలిలోన తేలి కన్నీటితో నిండి
మెత్త నైనదగుట మెత్తువోయి
తెల్లనైన నీదు దేహమ్ము పైదాని
యసిత ఛాయలెంతొ అందమిచ్చు

69

THE same stream of life that runs through my veins night and day runs through the world and dances in rhythmic measures.

It is the same life that shoots in joy through the dust of the earth in numberless blades of grass and breaks into tumultuous waves of leaves and flowers.

It is the same life that is rocked in the ocean-cradle of birth and of death, in ebb and in flow.

I feel my limbs are made glorious by the touch of this world of life. And my pride is from the life-throb of ages dancing in my blood this moment.

సీ. నరనరమ్ముల లోన నాట్యమాడుచునుండు
పవలు రాత్రుల నదె, ప్రాణశక్తి!

రాగతాళ గతుల లయరీతిగ కదలి
నిఖిల లోకమ్ముల నిండు శక్తి!!

భూరజమ్మున పొంగి పులకించి గరికపై
పత్ర పుష్పాలుగ పరిమళించు

జన్మమృత్యువులను జలధినూయలలూగు
ఆటుపోటులనెన్నొ అనుభవించి

ఆ. తనువులో ప్రతి యణువణువులో మిళితమై
తేజమొసగు నాదు దేహమునకు
ప్రాణనాడులందు పర్వెత్తు గర్వమ్ము
ఆడుచున్నదిప్పు డతిశయమున 

Posted in December 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!