గీతా శోభనం
కాటుకద్దిన కనుదోయి కైపుదోచె రేయిలొ
కన్నె వయసు కలలన్నీ కరిగేటి హాయిలొ
మూగ వోతివె ఓ ప్రియా
ముద్దు చేయవా నా జయా ||మూగ
మల్లె పూవులు మాలికలై
మంత్ర ముగ్దపు ప్రత్యావశులుగ ఊగిన రేయి
సన్నజాజులు శయ్యలపై స్వాగతాలు సలిపిన రేయి
మనసు మనసును పెనవేసి మమతలన్ని చవిచూసి
మనో రంజిత మన్మధప్రియులుగ
మనువు లాడు రేయి మరుల తేనె రేయి
మరువ లేని రేయి మరల రాని రేయి ||మూగ
చందమామ జతకోసం నిండుగాను పూచినరేయి
మలయమారుతం మనకోసం మెండుగా వీచినరేయి
తనువుల తహ తహలో అణువు అణువుల అల్లికలతో
తనివి తీరిన తమకంలో తన్మయత్వపు తామరలతో ||మూగ
స్వప్న సౌధం పొందిన రేయి
స్వర్గ సౌరభమందిన రేయి
ప్రణయ జగతిగ మారిన రేయి
పరమ ప్రణతిగ తూగినరేయి ||మూగ