Menu Close
Kadambam Page Title

గవీశపాత్రో నగజార్తిహారి

- వి. రావు పోతాప్రగడ

ఈ పద్యములో తొలి అక్షర భేదంతో శివ,కేశవులను ఇరువురిని స్తుతియించిన పద్య సృష్టికర్త పటిమకు నా హృదయపూర్వక జోహార్లు.

కుమారతాతః శశిఖండమౌళి
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాది పరమేశ్వరో నః

గవీశపాత్రః : గవాం ఈశః  గవీశః -- ఆవులకు ప్రభువైన వృషభం - వృషభం వాహనముగ కలవాడు -- సదాశివుడు.

నగజార్తిహారి: నగజ అంటే పార్వతీదేవి -- ఆవిడ ఆర్తి పోగొట్టేవాడు -- సాంబశివుడు.

కుమారతాతః : తాతః అనే సంస్కృత పదానికి అర్ధము -- తండ్రి -- కుమారస్వామికి తండ్రి  --  శివుడు.

శశిఖండమౌళి : చంద్రవంకను శిరస్సున ధరించేవాడు – శంకరుడు.

లంకేశ సంపూజిత పాదపద్మః : లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడు - ఈశ్వరుడు

అనాదిః : ఆది లేనివాడు  --  ఆదిమధ్యాంత రహితుడు అయినవాడు -- మహాదేవుడు

పరమేశ్వరః న పాయత్ : పరమేశ్వరుడు మనలను కాపాడుగాక.

అనాదిః -- ఆది లేనిది (తొలి అక్షరం)
(గ)వీశపాత్ర -- విః -- పక్షి      ఈశః  వీశః  -- పక్షులకు రాజు -- గరుడుడు వాహనముగ కలవాడు  -- విష్ణువు.
(న)గజార్తి హారి --  గజేంద్ర హారి  -- గజేంద్రమోక్షము చేసిన విష్ణువు.
(కు)మారతాతః --  మన్మధుని తండ్రి అయిన విష్ణువు.
(శ)శిఖండమౌళి -- నెమలి పింఛమును ధరించిన విష్ణువు.
(లం)కేశ సంపూజిత పాదపద్మ -- క అంటే బ్రహ్మ,  ఈశః  అంటే రుద్రుడు -- బ్రహ్మ, రుద్రేందాదులు పూజించిన పాదపద్మములు కలవాడు -- విష్ణువు.
(ప)రమేశ్వరః న పాయత్ -- విష్ణువు  మనలను కాపాడుగాక
Posted in November 2018, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!