Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
చిత్రకవిత – పడమటికనుమలు
– అయ్యగారి సూర్యనారాయణమూర్తి –
చం. ఇటఁ గనినార మీశ్వరుని సృష్టివిలాసము లెన్నియో, మహో
త్కటకటుగుల్మవల్లికలు(1), ధ్యాననిమగ్నమునీంద్రులో యనన్
గటకములన్ నిటారుగను గన్పడు నిశ్చలపూగభూరుహా(2)
లటనట సస్యసంపదయు నద్రిసమీరపటీరవారమున్(3)
(1) ఆత్యధికమైన సువాసనకల పొదలు, లతలు
(తేయాకు మఱియు లవంగలు, మిరియాలు,
మొదలగు సుగంధద్రవ్యాలు)
(2) పోకచెట్లు
(3) మలయమారుతము, మేఘసమూహము
Western-Ghats
Posted in March 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *