యావత్ భారత సంగీత అభిమానుల మనసులో స్థిరస్థానాన్ని సంపాదించుకొని ఆరు దశాబ్దాలు సినీ కళామతల్లికి తన గాత్ర శుద్ధితో సేవలందించిన గాన గంధర్వుడు, శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం జయంతిని (జూన్ 4) పురస్కరించుకుని, ఆ మహానుభావునికి నివాళిగా, సంగీతంలో తమకంటూ ఒక స్థాన్నాన్ని సంపాదించుకొని అనేక విధములుగా కళామతల్లికి సేవలందిస్తున్న సంగీత నిష్ణాతుల నుండి బాల సుబ్రహ్మణ్యం గారి గురించి వారి మాటలను, వారి గాత్రంతో అలరించిన పాటలను సేకరించి ఇక్కడ ప్రచురిస్తున్నాము. మా సంకల్పానికి మనస్ఫూర్తిగా చేయూతనందించి మాకు అడిగిన వెంటనే ఆడియో పంపిన సంగీత విద్వత్తులందరికీ కృతఙ్ఞతలు. అందుకు ఎంతగానో సహకరించిన మిత్రులు శ్రీ నటరాజన్ గుత్తా గారికి ధన్యవాదాలు.
మధు బుడమగుంట
బాల్యం నుండే సంగీతం మీద మక్కువ ఏర్పరుచుకుని శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని సంగీతంలో పట్టు సాధించి బాలు గారి పాటల స్ఫూర్తితో సినీ గేయాల మీద ఆసక్తిని పెంచుకొని ‘పాడుతా తీయగా’ వేదికమీద తన ప్రతిభతో బాలు గారి ఆశీస్సులు అందుకుని విజేతగా నిలిచిన చిరంజీవి అభిజిత్, బాలుగారి జయంతిని పురస్కరించుకుని పాడిన ఈ పాటను మీ వీనులకు విందుగా, బాలు గారికి నివాళిగా మీకు అందిస్తున్నాము.
బాలు గారి పాటలు విని స్ఫూర్తినొంది, సంగీతం మీద ఆసక్తి కలిగి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకొని, నేర్చుకుంటూ ఉన్న యువరత్నాలు తమ గళంలో బాలుగారిని ఆవిష్కరిస్తూ ఆయన పాటలను ఎంతో కృషితో పాడి ఆ మహానుభావునికి నీరాజనాలు అర్పిస్తున్నారు. మీ ఆశీస్సులతో వారిని అభినందించ మనవి.
బాలు ది గ్రేట్….మీ లోటు ఎవరూ పూడ్చలేనిది.మీ పాట ఎవరూ దోచలేనిది