విదేశాల్లో
ఎక్కువగా
తుపాన్లు భూకంపాలు
వస్తాయి ఎందుకో
అన్నదామె
సంపదకై
సంస్కారాన్ని
సుఖాలకై
శీలాన్ని
ఖూనీ చేయటం
వలన అన్నాడతను
అసలు
విషయం అర్థమైన
అవనిలో
ఎంటో అదుపు తప్పిన
ఆర్భాటాలంటూ
నడకకు పని
చెప్పిందామె
ఆరుగాలం
కష్టించున రైతు
పంటననమ్ముకోగానే
ఆత్మహత్య
చేసుకుంటున్నాడు
ఎందుకో యని
అడిగిందామె
అప్పులెన్ని
పెరిగిన
ఓదార్పు నిచ్చే
పచ్చని కూతురు
దళారింటికి
కాపురం వెళ్ళగానే
ఒంటరిగా ఉండలేక
తన కూతుర్ని చేరలేక
ఆత్మహత్య చేసుకుంటున్నాడన్నాడతను
ఈ రైతు
కష్టాలెప్పుడు
తప్పుతాయో యని
చలించిన హృదయంతో
జలదరించిన తనువుతో
మదిలో నమస్కారం చేస్తూ
తరలిపోయిందామె
ఆకులేయని
నీరే త్రాగని
నేలపై సాగని
తీగేమిటండి
అని అడిగిందామె
ప్రాణాలను
నీరులా త్రాగి
ఆకుల్లా రాల్చి
నేలకు కూల్చే
కరెంట్ తీగ
అన్నాడతను
కరెంటు తీగకు
ఇంత కథనా
అంటూ
కరెంట్ పోయిన
బల్బులా
బయలుదేరిందామె
మీ
కవితకు
ఆకర్షణ శక్తి
ఎక్కువగా
ఉంటుంది
ఎలాగండి అన్నదామె
నేను
ఊహాలోకం
గూర్చి కాకుండా
వాస్తవ లోక
వాసనల వర్ణన
చేయడమే అన్నాడతను
తన
ఆలోచనల
తీరు మార్చుకొనుటకు
తనదైన తీరులో
తరలిపోయిందామె
ఆకుల్లేని
అడవికెళ్ళి
జీవంలేని
జంతువొకటి
జీవమున్న
జంతువును
పట్టుకొచ్చెనంటే
ఏమిటండి
అని అడిగిందామె
మనం
తిరుమల
వెళ్ళి
తలనీలాలు
చేయించుకొనగా
ఎంతో సంతోషంగా
పనిభారం తగ్గిందని
హాయిగా సేదాతీరే
దువ్వెనన్నాడతను
దువ్వెనకు
ఇంత ధమాకా
అనుకుని
దిమాకా ఖరాబై
కదలిపోయిందామె