
రచయిత పరిచయం ..
తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు
పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్ (దక్షిణ మధ్య రైల్వే), సిగ్నల్ మరియు టెలికాం. విభాగమునందు 25 సంవత్సరములు, అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, 15 సంవత్సరాలు బహుళ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలయందు దేశ, విదేశాలలో పదవీ బాధ్యతలను పూర్తిచేసి, 2015 సం. నుండి హైదరాబాద్ మెట్రో రైలు రవాణా రంగ నిర్మాణ కన్సల్టింగ్ ఇంజనీరుగా బాధ్యతలను నిర్వర్తించి పదవీ విరమణ చేశారు.
అభిరుచులు: తెలుగు భాష పై అభిమానం, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ.
సిరిమల్లె మాస పత్రిక తో చిన్న కవితల ద్వారా 2015 సం.లో పరిచయం, గత 2022, 2023, 2024 మూడు సం.లుగా అర్థ సహిత లలితా సహస్ర నామావళి అందజేయబడినది, రాబోయే 2025, 2026, 2027 సం.లలో 108 శ్లోకాలు, 1000 నామాలతో అర్థ సహిత విష్ణు సహస్ర నామావళిని అందజేస్తున్నారు.