Menu Close
mg

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

హిందువుల పండగలలో దసరా పండుగకు ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులు దుర్గా మాతను స్మరిస్తూ చేసే పూజలు, జరిపే ఉత్సవాలు, వివిధ వేషధారణలతో కనులపండుగగా జరుపుకునే ఈ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కళా తపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సప్తపది సినిమా కొరకు ప్రముఖ సినీ రచయిత కీర్తి శేషులు శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండి వెలువడిన సంస్కృత మిళితమై అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే  పదసరాలకు సంగీత స్వర ధుని కే.వి. మహదేవన్ గారి స్వరకల్పనలో  కీర్తిశేషులు బాలు గారి గళంతో సుశీల గారు కలిసి పాడిన ఈ అఖిలాండేశ్వరి.. పాటను మీకు దసరా శుభాకాంక్షలతో అందిస్తున్నాము.

చిత్రం: సప్తపది; సంగీతం: కే.వి. మహదేవన్; రచన:వేటూరి; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి పి. సుశీల.

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీమ్

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి
శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్థగాత్రి
సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
సర్వార్థసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తి
చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగ శోభిని కుసుమబాణ సంశోభిని
మౌనసుహాసిని గానవినోదిని భగవతీ పార్వతీ దేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీహరి ప్రణయాంబు రాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి
శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని  శ్రీపీఠ సంవర్ధిని డోలాసుర మర్ధిని
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి
ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి
సకలభోగ సౌభాగ్య లక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే
ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే
సరససాహిత్య స్వరససంగీత స్తనయుగళే
వరదే అక్షరరూపిణే శారదే దేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

వింధ్యాకరీ వాసినే యోగసంధ్యా సముద్భాసినే
సింహాసనస్థాయినే దుష్టహరరంహక్రియాశాలినే
విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబితకేశపాశినే
మహిషమర్ధనశీల మహితగర్జనలోల భయజనర్తనకేళికే
కాళికే దుర్గమాగమ దుర్గ పాహినే.. దుర్గే దేవి

Posted in October 2021, పాటలు