సుబ్రహ్మణ్య స్వామి శిరసా నమామి!
సంగీత సామ్రాజ్య తేజో విరాజా!
పాటల తేటివై మాటల పేటివై
పుట్టిన తావుకు పూర్ణ చంద్రుడివై
సంగీత గగనాన బాల భాస్కర రూప
మధ్యాహ్న మార్తాండ ప్రచండ తేజా!
సాయం సంధ్యలో సౌమ్య స్వరూపా!
సూర్య చంద్రుల బోలు నీ సరిరారేవ్వారు
మాటలో మధురిమలు పాటలో సుస్వరము
జీవనశైలిలో ఆద్వైతసారము
నీ హృదయ క్షేత్రాన శివస్వామి రూపం
నీ జీవితమొక వేదాంత సారం
జన్మదాతలకు నీవు మోక్ష ప్రదాతవు
కష్టజీవులకు ఇష్ట దైవమె నీవు
స్నేహ బంధానికి బృందావనమ్ము
ఊహకందనిదయ్య నీ కీర్తి సంపద
మధు లిహమువై నీవు
స్వర పుష్ప మంజరుల
లోనారసి మధువు గ్రోలిన స్వామీ!
నీ గరిమ నీదని నీదారి నీదనీ*
పలికెద సర్వదా సంగీత తిలకా!
పొగడుటకు బోలెడు పదములున్నాయి
కన్నీటి మడుగునవి మునిగిపోయాయి
క్షర మెరుగనిదయ్య వసుధలో అక్షరము
అక్షరాంజలులివే అర్పించు చుంటి భక్తితో
సకల వసుంధరరా జన నివాళులివే నీకు!
(*నీ గరిమ నీదని నీదారి నీదనీ......ఇందులో స్వరం, సాహిత్యం రెండు ఒకటే. దీనిని స్వరసాహిత్యం అంటారు)