Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు
5. “నిరీక్షణ”

ఓ ప్రియతమా!
ప్రేమకై అన్వేషిస్తున్నావా!

ఈ తుఫాను రాత్రి
చీకట్లో పయనిస్తున్నావా!

ఆకాశం నిరాశతో నిట్టూర్చుతున్నది
నా కనులకు నిదుర రావడం లేదు
ఉండుండి చీకట్లో చూస్తున్నా..
హృదయపు వాకిట్లో నిలుచున్నా..

నా ఎదుట అంతా చీకటే
నీవెక్కడా? అని శోధిస్తున్నా
ఏ నల్లని ఆకారం కదిలినా
ఏ గాలి సవ్వడి రేగినా
ఆ నీవే..
నా సుఖదుఃఖాల నిత్య సహచరివని
ఆ నీవే...
నా కలల వెలుగుల అనంత జీవిత పథచారివని
కనుబొమలు చిట్లించి చూస్తున్నా

ఏ చీకటి చిక్కుల అడవుల గుండా
ఏ రహస్యపు అంచుల దారుల గుండా
వస్తావో! సఖా!

***సశేషం***

Posted in October 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!