Menu Close
Kadambam Page Title
పోగొట్టుకున్న జ్ఞాపకాలు
-- గవిడి శ్రీనివాస్

ఏమనీ చెప్పలేను
నిత్యం కళ్ల వాకిళ్ళలో
తూనీగలా ఎగురుతూ
ముందుండే జ్ఞాపకాలకు
మబ్బులు కమ్ముకున్నాయి.

ఎన్ని చూపుల నెగరేసినా
చుక్కల మధ్య నిన్ను అందుకోలేను.

ఉన్నట్టుండి ముసిరే గాలులు
ఉహల చిత్రాల్ని సైతం చెరుపుతున్నాయి.

కాలం రెక్కల పై నిజం సాక్షి గా
దూరాలు భారాలైన
జ్ఞాపకాల్లో ఊయలూగేవాళ్ళం

దొరికిన సంతోషాన్ని
గుప్పెట్లో దాచుకుని

ఎగిరే కలలకి ఇప్పుడు
కన్నీటి వాగులమయ్యాం.

ఇప్పటి ప్రపంచం మారింది
ఒత్తిడి సాగరం లో ఈదుకుంటూ
పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని
నెమరేసుకోటానికి
కాసింత సమయం,
కాసింత ఉపశమనం కావాలి
మనం మళ్ళీ వేకువ రెప్పల పై
తడి తడి గా ఉదయించాలి.

Posted in August 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *