భారతదేశ సుప్రసిద్ధ లక్ష్మీదేవ్యాలయాలలో ఒకటి పశ్చిమప్రాంతంలో కొల్హాపూర్ లోను మఱొకటి తూర్పుప్రాంతంలో విశాఖపట్టణము లోను ఉన్నాయి. విశాఖలో వెలసిన తల్లి కనకమహాలక్ష్మిగా నిరంతరం పూజ లందుకొంటోంది.
మత్తకోకిల
మాసరాజము మార్గశీర్షము; మాధవుండె వచించె నా
మాసమే తనవాసమంచును మార్గదర్శిని గీతలో;
ధ్యాస నిల్పుచుఁ గొల్చువారికి నా హరిప్రియ లక్ష్మి వ్య
త్యాస భావము లేక భాగ్యము లందఁజేయఁగ నిల్చెఁగా
తరలము
జనులచెంతను సంతతంబును సంతసంబుగఁ బూజలన్
కొనుచు వారలఁ గన్నతల్లిగఁ గోర్కెలెల్లను దీర్పఁ దా
ఘననివాసము గోపురంబునుఁ గాదుకాదని వీధిమ
ధ్యను వసించుట కోరుకొన్న మహాకృపాంబుధి తానెగా
కం.
అంబుధితీరమునందున
అంబుధిసుత కొలువుదీరి యాదుకొనఁగ భ
క్తాంబుధి యుప్పొంగఁగఁ గని
అంబుధిశయనుండు మెచ్చు నద్భుత మిదియే
అంబుధిసుత కొలువుదీరి యాదుకొనఁగ భ
క్తాంబుధి యుప్పొంగఁగఁ గని
అంబుధిశయనుండు మెచ్చు నద్భుత మిదియే
కం.
కనకమహాలక్ష్మ్యాఖ్యను
మనమున ధ్యానింపఁ జాలు; మన మెఱిఁగి శుభా
లనయము లభించు వరమిడు
మన మున్న శుభప్రదాత్రి మఱిమఱి కొలుతున్
మనమున ధ్యానింపఁ జాలు; మన మెఱిఁగి శుభా
లనయము లభించు వరమిడు
మన మున్న శుభప్రదాత్రి మఱిమఱి కొలుతున్
కం.
గురువారంబుల పూజలు
గురుశుభఫలముల నొసంగుఁ గోటివిధాలన్
అరుదగు మార్గశిరంబున
తరియింపఁగఁ దగిన యదను దాసజనులకున్
గురుశుభఫలముల నొసంగుఁ గోటివిధాలన్
అరుదగు మార్గశిరంబున
తరియింపఁగఁ దగిన యదను దాసజనులకున్