Menu Close
మనోల్లాస గేయం
మధు బుడమగుంట

బాబూ..వినరా..

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్న కాలంలో కుటుంబం లోని తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లిళ్ళ మధ్యన పెనవేసుకుని ఉన్న అనుబంధాల ఒరవడి నాడు ఎంతగానో బలంగా ఉండేది. కష్టనష్టాలకు, ఆనందకర శుభకార్యాలకు, పండగలకు ఇంటిల్లిపాది ఒక్కటిగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలసి ఉండేవారు. కనుకనే నాడు వచ్చిన పాత సినిమాలు ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు అన్నీ కుటుంబ వ్యవస్థ యొక్క అవసరాన్ని, పాముఖ్యతను వివరిస్తూ ఎంతో హృద్యంగా నిర్మించడం జరిగేది. ఆ కోవలోనే వచ్చిన పండంటి కాపురం చిత్రం లోని ఈ మధురమైన పాటను ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరోసారి గుర్తుచేసుకుందాం.

చిత్రం: పండంటి కాపురం (1972); సంగీతం: కోదండపాణి; గీతరచయిత: దాశరధి; గానం: ఘంటసాల

పల్లవి:
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..సాగించారు పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

చరణం 1:
ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
ఆఆ ఆఆ ఆఆ…ఓ ఓ ఓ ఓ ఓ ఓ…..
ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై కలసి నడిచారు వారు
అన్నంటే తమ్ములకు అనురాగమే…
అన్నకు తమ్ములంటే అనుబంధమే…
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..

చరణం 2:
చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..
చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..
పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..

చరణం 3:
అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ
తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు
పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ
కలకాలం ఈలాగే కలసివుండాలీ
బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..సాగించారు పండంటి కాపురం..
ఆఆ…ఆఆ…ఓఓఓ…ఓఓఓ..

********

Posted in March 2026, పాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *