Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు

దేవుడా నీ వుంటే రావేల

సీసం:

కోటాను కోట్ల నీ కూర్మి జనులిచట
కూలి పోతున్నారు కూడులేక
లక్షో పలక్ష లు భిక్షలకై జూస్తు
బ్రతుకుతున్నా రిచట వెతల తోడ
వేలకు వేలుగా వెలది బ్రతుకులిల
మాడి పోతున్నవి మగమృగాల
దోచుకొని జనుల దాచుకొను దనుజుల్
కులుకుతున్నారిట కోట్లనీడ

తేటగీతి:

అరయ జూడవేల యొకమారు యవనియందు
శిష్టరక్షణ దుష్టుల శీ క్షణే ది
సత్వరంబున రాకున్న సర్వసృష్టి
నాశనమగు గాదె కలువ నయన దేవ

ముసలి అమ్మానాన్నల వేడి కోలు

కంటిమి నిన్ను మాకడుపు కష్టము నోరిచి పెంచినామురా
చంటిని జేసి మామనసు చల్లగ మాయెద కోర్కెలెల్ల వ
ద్దంటిమిరా యిలన్ కుదురు యాశల చంద్రుడు నీ వురా యికన్
పెంటిది రాగ నువ్వు మము వీధిన తోయకు వృద్ధులైతిమీ

పైన తెల్పిన పద్యాన్ని అచ్చ తెనుగు మాటలలో వ్రాస్తే....చూడండి

ఉత్పలమాల:

కంటిమి నిన్ను మా కడుపు కాలిన నోర్చుచు పెంచినామురా
చంటిని జేసి మాయెడద చల్లగ మాయెద కోర్కె లెల్ల వ
ద్దంటిమిరా యిలన్ కుడురునందున మెచ్చెడి వేల్పు వై యికన్
పెంటిది రాగ నువ్వు మము వేరుగ తోయకు ముత్తలైతిమీ

....తొలి పాడికలో కష్టం, మనసు, ఆశల, చంద్రుడు, వీధి .. వృద్ధులు ... సంస్కృత పదాలు గమనించగలరు....

Posted in October 2019, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!