Menu Close
Kadambam Page Title
సంధి కాలం
- గవిడి శ్రీనివాస్

ఇన్నేళ్లు, ఇన్ని రోజులు
గడిసి పోయాక
కాసేపు నాలోకి అవలోకించుకుంటాను.
కొన్ని జ్ఞాపకాలు
అలా తడుముతుంటాయి.
నా ఊరు నా వాకిలి
నా చుట్టూ నడిసిన పరిసరాలు
కళ్ళ ముందు పక్షుల్లా వాలతాయి.
నేను
మొక్కను చూస్తూ మొలిచాను
పూవును చూస్తూ పరిమళించాను
మట్టిని తాకుతూ
దేహమే అనుకున్నాను.
ఊరూ మారింది
జీవన సరళీ కొత్తగుంది
గుడిసెలు ముడుచుకున్నాయి
మార్పు సహజమే
మారనిదల్లా
కాసింత ప్రేమ కోరుకునే మనసు మాత్రమే
ఆప్యాయంగా పలకరించే
నా పొరుగు వాళ్ళు
వారి మాటలు తడిపి పోతుంటాయి.

ఇన్ని జ్ఞాపకాల తర్వాత
ఇవి గుర్తొచ్చిన సంధి కాలం
నాలో నేను
ఒక తీపి అనుభూతిగా
మిగిలిపోతాను.

Posted in May 2018, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!