Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

 

౨౬౧. గొయ్యి తవ్వితే వచ్చిన మట్టి, తిరిగి ఆ గొయ్యి పూడ్చడానికి చాలదు.

౨౬౨. ఎదురెత్తు వేసి చదరంగం ఆడాలంటే సమర్ధత ఉండాలి.

౨౬౩. ఆలుమగలు సంసారమనే బండికి కట్టిన జోడు ఎద్దులు!

౨౬౪. సంసారమంటే సమసారం!

౨౬౫. సంసారం సాగరం లాంటిది.

౨౬౬. బ్రతుకు తక్కువ బడాయి ఎక్కువ.

౨౬౭. ఆశకు అడ్డు, సముద్రానికి హద్దు లేవు.

౨౬౮. లేడికి లేచిందే పరుగు!

౨౬౯. ఎదురుగుండా వచ్చిన వాడే పెళ్ళికొడుకు - అన్నట్లు...

౨౭౦. పరువం పరవళ్ళు తొక్కితే పట్ట పగ్గాలు ఉండవు.

౨౭౧. పులితోలు కప్పుకున్నంత మాత్రాన గాడిద పులి ఔతుందా?

౨౭౨. నెమిలి ఈకలు కట్టుకుని ఆడినంతమాత్రాన కాకి నెమలౌతుందా?

౨౭౩. చావు తప్పి కన్ను గుడ్డయ్యిందిట!

౨౭౪. పుర్రిన పుట్టిన బుద్ధికి పుడకలతోనే విముక్తి.

౨౭౫. నక్క ఒకచోట గౌరీ కల్యాణo, మరొకచోట ఈలపాట పాడుతుందా!

౨౭౬. ఎర్రచీర కట్టిందే నా పెళ్ళాం అన్నట్లు ...

౨౭౭. ముద్దు చేసినప్పుడే చంకెక్కాలి.

౨౭౮. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు.

౨౭౯. నిప్పుని తాకితే కాలక మానదు.

౨౮౦. కుళ్ళుగుంటను కెలికి కంపు కొడుతోంది అంటే ఎలాగ?

౨౮౧. పరుగెడుతూ పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.

౨౮౨. అప్పు చేసి పప్పుకూడు తినడం తప్పు.

౨౮౩. అప్పు పెను ముప్పు!

౨౮౪. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.

౨౮౫. అందరికీ అన్నిరోగాలూ ఉన్నాయిగాని అడ్డెడు తప్పేలాకి ఏ రోగం లేదు.

౨౮౬. సూదికోసం సోదికి వెడితే పాత తప్పులన్నీ పైకి వచ్చాయట!

౨౮౭. పిల్ల ముద్దుగా ఉందని ముక్కు తుడిచి ముఖానికి రాసుకుంటామా?

౨౮౮. చూరులో ఎలుకలున్నాయని ఎవరైనా కొంపకి నిప్పెట్టుకుంటారా?

౨౮౯. ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలిoగంట!

౨౯౦. ఐతంపూడి ఉద్యోగం ఐతే గియితే, ఐదు గేదెల పాడి చేస్తే గీస్తే - చల్ల మావాళ్ళకు పోస్తావా లేక మీవాళ్ళకు పోస్తావా?

Posted in September 2018, సామెతలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!