Menu Close

నోరూరించే రుచి

కొబ్బరి - కంది పచ్చడి

కావలసినవి:

  • కందిపప్పు - ఒక కప్పు
  • పచ్చి కొబ్బరి ముక్కలు (సుమారుగా ఒక చిప్ప) – అర కప్పు
  • ఎండుమిర్చి – పది
  • వెల్లుల్లి పాయలు – రెండు లేదా మూడు
  • చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను
  • జీలకర్ర – ఒక టీ స్పూను
  • ఉప్పు తగినంత
Kobbari Kandi Pachadi

చేయు పద్దతి:

  1. కందిపప్పు + ఎండుమిర్చి రెండింటినీ నూనె లేకుండా వేరు వేరుగా వేయించుకొని, ఒక ప్లేటులో వేసి ఆరనివ్వాలి.
  2. మిక్సీ జార్ లో వేయించి పెట్టుకొన్న కందిపప్పు, ఎండుమిర్చి లను వేసి, అందులోనే వెల్లుల్లి పాయలు, ఉప్పు మరియు కొద్దిగా నీరు వేసి మెత్తగా ఆడించుకోవాలి.
  3. తర్వాత, కొబ్బరి ముక్కలు, చింతపండు గుజ్జు లను అందులో వేసి మరల మిక్సీ ఆడించుకోవాలి.
  4. అంతే!! ఘుమఘుమలాడే రుచికరమైన పచ్చడి రెడీ!! మీకు ఇష్టమైతే ఈ పచ్చడి పై పోపు వేసుకొని కలుపుకొనవచ్చును.
  5. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కాస్త నెయ్యితో కలుపుకొని తింటే...... ఆహా ఏమి రుచి.... అనక మానరు!!
Posted in May 2018, వీక్షణం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!