Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు
4. నీకై పాట

ఓ ప్రేమమూర్తీ!
నీకై ఒక పాట పాడమన్నప్పుడు
నీకై ఒక రాగం ఆలపించమన్నప్పుడు

నా ఎదలో ఏదో అలజడి
ఎక్కడైనా అపశృతి అవుతుందేమోనని..
నా కళ్ళు చెమరిస్తాయి
సహనంతో
నా వాళ్ళు జలదరిస్తుంది
ఆహ్లాదంతో

నా బ్రతుకు మలినమేమోనని
నా స్వరం మాధుర్యం కాదేమోనని
నా సంతోషం మబ్బువలె విడిపోతుంది
నా ఆనందం పక్షివలె ఎగిరిపోతుంది.

నా పాటంటే
నీకు ప్రియమని తెలుసు
నా గానం
నీ ప్రేమకు ఆహ్వానమని తెలుసు

ఎన్నటికైనా ... నేను
నీ పాదాలు స్పృశించగలనా!
నా గానంతో
నిను మైమరపించగలనా!!

***సశేషం***

Posted in September 2021, తేనెలొలుకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *