Menu Close
Kadambam Page Title
వృద్ధాప్యం- వరమా? శాపమా?
-- ఆదూరి హైమావతి

‘వృధ్ధాప్యమన్నది, ఒక మందులేని రోగమన్నాడు’  మనువు.
మనువు అనుభవించే  చెప్పాడా! చెప్పేక అనుభవించాడా?!
- అదో పెద్ద సందేహం.

మనస్సు మాట వినదు - జిహ్వ చాపల్యం చావదు
పటుత్వం పాటు తప్పినా - 'నవత్వం' నాదే నంటుంది.
నడుం వంగిపోయినా అహం మాత్రం కుంగదు.

‘ముసలి మనస్సు' మహాచెడ్డది – అన్నీకావాలని -
నవ్వులపాలవుతుంటుంది.

కళ్ళు కనిపించకున్నా - వళ్ళు నిలువరించకున్నా
'మాకాలంలో… ..' మాటలుమాత్రం - మరుగునపడవు.
అరవైలో ఇరవై కావాలని - ఆయుర్దాయం ఆరురెట్లు పెరగాలనీ
తెల్ల మీసాలకు సంపెంగ నూనె రాచి - తలకట్టుకు రంగువేసి
స్వీట్ సిక్స్ టీనైపోయి - చూపరుల కళ్ళు కుట్టాలనీ
ఉషస్సుకై ఉరకలు వేస్తుంటుంది - ఉట్టికట్టుకుని ఊరేగాలంటుంది.
ఊరుపొమ్మంటున్నా-కాడు రమ్మంటున్నా,
‘అప్పుడే ఏo తొందర?-ఆగాగు!‘ అంటుంది.

మనసే మనిషి కి [పెద్ద] బధ్ధ శతృవు -
మాట వింటే మంచి మితృడూనూ!
జీవిత మంతా సవ్యంగా ఉపయోగిoచి ఉంటే వరమే! -
హాయిగా విశ్రాంతిపోందే కాలం
అపసవ్యపు జీవనమైతే పరమశాపమే -
ఆలనా పాలనా లేక మాటలు కరువై ముఖం వాయాల్సిందే!
మానవత్వపు కవాటాలు మూసేసుకుంటే –
మృగంలా వంటరిగా బ్రతికేయాల్సిందే !

ఉతికి ఉతికి వాడిన చొక్కా ఇంకాఎన్నాళ్ళూ?
వెతికి వెతికి చూసిన నేత్రాలింకా ఎన్నేళ్ళూ !
ఙ్ఞాననేత్రాన్నివెతికి చూసే ప్రయత్నం చేసి,
విఙ్ఞాన ఘట్టాన్ని చేరే మార్గం చూసి ,
పక్షులను చూసి డిటాచ్ మెంటూ -
పశువులనుచూసి స్వతంత్ర జీవనమూ -
చెట్లనుచూసి త్యాగభావమూ -
నదులనుచూసి సేవాభావమూ,
‘ప్రకృతి బడి’ లో పాఠాలునేర్చి -
స్వార్ధాన్ని విడనాడి సమాజానికి మేలుచేస్తే,

అంతా నీవారే అవుతారు -అందరూ ఆదరిస్తారు.
మనస్సు పరిపక్వత చెంది మనకు మంచి మితృడౌతుంది.
వృధ్ధాప్యమూ ఒక వరమే అవుతుంది మరి!

Posted in September 2019, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!