Menu Close
Ayyagari-Suryanarayana-Moorthy
వినాయకప్రపత్తి
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
సుగంధి 
ఆదిపూజ్య! విఘ్నరాజ! యన్ని నీవె మా కయా!
మోదకప్రియా! భజింతు మోద మీవె కూర్పవే
వేదవేద్య! యాఖువాహ! వేదనల్ హరించి, నీ
పాదదాసులన్ మమున్ గృపన్ గనంగ రావయా!

కం. మనమున నినుఁ గొల్తుమయా
      మన(1) మను భావంబు వీడ మా తర మగునే?
      మన(2)గలము నీదు కృపచే,
      మనఁ గలము(3) రచించుఁ బద్యమాధురిఁ బంచన్
          (1) నీవు+మేము (2) బ్రతుక (3) లేఖిని

కం. కరుణించిన గణపతి! నీ
      వరుదెంచినఁ జాలుఁగా భయంబులు దొలఁగున్
      నిరతము మా యెడ నున్నను
      బరుగిడు విఘ్నంబు లెల్ల భద్రేభముఖా!
Posted in September 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *