ఏ చిత్రమైనా మంచి రాబడిని పెంచి, ఎంతో విజయవంతమైన చిత్రం గా నిలవాలంటే ఒకప్పుడు ఆ చిత్రం సినిమా హాళ్ళలోనే ఎక్కువ రోజులు ఆడాలి. అలా ఆడాలంటే ఆ చిత్రం అన్ని విధాలా ప్రేక్షకుల మన్ననలను పొందాలి. అటువంటి కోవలోనే 1981 సంవత్సరంలో వచ్చిన ‘ప్రేమాభిషేకం’. దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో విడుదల అయిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగేశ్వరరావు గారి నటన అద్భుతంగా ఉంది. అందులోని పాటలు నేటికీ మనలో చాలా మందికి గుర్తుంటాయి. ఆ పాటలలోని భావుకత ఎంతో ఆకర్షణీయంగా ఉండి ఇట్టే ఆ పాటలను నేర్చుకోవాలనే భావన కలిగిస్తాయి. ప్రేమాభిషేకం చిత్రం నుండి ‘వందనం అభివందనం’ పాటను మీ కోసం అందిస్తున్నాము.
పల్లవి :
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం... పాదాభివందనం...
పాదాభివందనం... పాదాభివందనం...
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
చరణం 1 :
కన్నులు పొడిచిన చీకటిలో... ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో... తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని
వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ..
వందనం అభివందనం
నీ అందమే... ఒక నందనం
చరణం 2 :
జీవితమన్నది మూడునాళ్ళని... యవ్వనమన్నది తిరిగిరానిదని
ప్రేమన్నది ఒక నటనమనీ...నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని... ఎవరున్నారని
ఉన్నానని... నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి
సుఖము పోసిన మేనక... అభినయ మేనక.. సారీ
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం... పాదాభివందనం...
పాదాభివందనం... పాదాభివందనం...
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం