పద్మ పబ్లిక్ గార్డెన్ కు ఎప్పటిమాదిరిగానే, అనుకున్న సమయానికి చేరుకుంది. ఆఫీసు అయిపోగానే, ఒక గంట సేపు పబ్లిక్ గార్డెన్ లో సేదదీరడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది. ఆమె ఎప్పుడూ కూర్చునే చోటు వెతుక్కుంటూ వెళ్ళింది.
అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ కూర్చోలేదు. త్వరగా వెళ్లి బాగ్ సిమెంట్ బెంచి మీద పెట్టి, తాను కాస్త దూరంగా కూర్చుని, బాగ్ లో ఉన్న నీళ్ల సీసా తీసుకుని కొద్దికొద్దిగా తాగుతూ, అతని రాక కోసం అటూఇటూ చూస్తూ వుంది. సమయానికి ఎప్పటిలా అతను అక్కడికి రాకపోయేసరికి, అనుకోకుండానే ఆమెలో కాస్త విసుగు మొదలైంది.
పద్మకు నిజానికి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులిద్దరూ పేరుమోసిన డాక్టర్లు. కొన్నితరాలకు సరిపడా ఆస్తి సంపాదించారు. పద్మ వాళ్లకి దేవుడిచ్చిన ఒక్కగానొక్క అమూల్య సంతానం. అయినా పి. జి, చేసిన పద్మ వూరికే కూర్చోలేక పోటీపరీక్షలు ఎన్నో రాసింది. అందులో తన ఊహకు భిన్నంగా ప్రసారభారతిలో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా సెలక్షన్ రావడంతో, అమ్మ నాన్నల ఆశీస్సులతో వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చేరిపోయింది. తాను పుట్టిపెరిగిన ఊళ్ళోనే ఉద్యోగం రావడం పద్మకి మరింత కలిసొచ్చినట్టు అయింది.
చిన్నప్పటినుండీ తండ్రి రేడియో ప్రోగ్రాములలో పాల్గొనడం గమనించింది కానీ, అక్కడ తనకు ఒక ఆఫీసర్ ఉద్యోగం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. అయినా సంవత్సర కాలంలో అంతా అవగాహన చేసుకుని, మంచి కార్యక్రమాలు రూపొందించి అనతికాలంలోనే అధికారుల మన్ననలు పొందగలిగింది. తనకు యువవాణి -సెక్షన్ అప్పగించడంతో , ఎంతోమంది యువతీ -యువకులు తమ కార్యక్రమాల ద్వారా పరిచయం అయ్యారు. అలా పరిచయం అయినవాడే, వివేక్.
వివేక్ చిక్కడపల్లిలో వుంటాడు. న్యాయ శాస్త్రంలో డిగ్రీ తీసుకుని, ఒక సీనియర్ దగ్గర అప్రెంటిస్ గా వున్నాడు. రచనావ్యాసంగంలో అభిరుచివుండడం వల్ల న్యాయానికి సంబందించిన అంశాలపై చిన్న-చిన్న వ్యాసాలూ రేడియోలో చదవడం ద్వారా పద్మకు పరిచయం అయ్యాడు. అప్పటినుంచీ ఇద్దరూ పబ్లిక్ గార్డెన్ లో ఒక గంటసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్లిపోవడం అలవాటు అయింది. అతని గురించి పద్మ మనస్సులో ఏముందో తెలీదుకానీ, అతను మాత్రం పద్మను అన్ని రకాలుగా ఇష్టపడుతున్నట్టు, రోజురోజుకీ అతనిలో వస్తున్న మార్పు పద్మ అర్ధం చేసుకోక పోలేదు. కానీ అతనిని చనువుగా ఏనాడూ హద్దులు మీరనీయలేదు.
రకరకాలుగా ఆలోచిస్తున్న పద్మకి వివేక్ రావడం కనిపించింది. నవ్వుతూ వేగంగా పద్మను సమీపిస్తున్న అతని చేతిలో ఎప్పటిమాదిరిగానే చిన్న కేరీ బాగ్ వుంది. అందులో రెండు ఆపిల్స్ ఉంటాయి. రోజూ కబుర్లు చెప్పుకుంటూ అవి తింటారు వాళ్లిద్దరూ. పద్మ దగ్గరకు వస్తూనే "సారీ డియర్, ఆలస్యం అయింది. మా బాస్ అనుకోకుండా, చిన్న పని అప్పగించాడు, అందుకే మన సమయానికి రాలేకపోయాను" అంటూ పద్మకు కొంచెం దూరంలో కూర్చున్నాడు వివేక్.
"చెప్పు పద్మా, ఏమిటి విశేషాలు?" అన్నాడు నవ్వుతూ.
"నా దగ్గర ఏమివుంటాయ్, నువ్వే చెప్పు" అంది ఆపిల్ కొరుకుతూ పద్మ.
"నీ దగ్గరకు వచ్చేముందు, నీకేదో చెబుదామనుకుంటాను కానీ నిన్ను చూడగానే అన్నీ మరచిపోతాను. అదీ అసలు విషయం" అన్నాడు వివేక్.
"నేనుకూడా నిన్నొకటి అడగాలని చాలా కాలంగా అనుకుంటున్నాను వివేక్" అంది నవ్వుతూ పద్మ.
"తప్పక అడుగు పద్మా .. నేను సిద్ధం" అన్నాడు వివేక్ తన మనసులోని మాటనే ఆమె రిపీట్ చేస్తుందనే సంతోషంతో.
"ఏమీలేదు ఎవరైనా ఇష్టమైన స్నేహితురాలికి పువ్వు బహుమతిగా ఇస్తారు. మరి, నువ్వేమిటి ఆపిల్ పండు ఇస్తావ్ నాకు రోజూ.." అంది మరింతగా ముఖంలో నవ్వు ప్రదర్శిస్తూ.
ఆమె మాటకు క్షణం షాక్ తిన్నాడు వివేక్. తర్వాత మెల్లగా తేరుకుని ముఖంలోకి నవ్వు కొనితెచ్చుకున్నట్టు నవ్వుతూ,
"నువ్వన్నది నిజమే సుమా! కానీ నేను ఆపిల్ ఇవ్వడం లో అర్ధం వుంది." అన్నాడు.
"ఏమిటది?" అంది ఆతృతగా పద్మ.
"ఆపిల్ తింటే .. డాక్టర్ తో పనివుండదని!" అన్నాడు ఓర చూపులు చూస్తూ .. తలగోక్కుంటూ.
" ఆ .. " అంది ఉలిక్కిపడ్డట్టుగా పద్మ.
తనకు కాబోయే భర్త ‘డాక్టర్ ‘అని ఇతనికి ఎలా తెలిసిందబ్బా .. అని ఒకింత ఆశ్చర్య పోతూ .. తన హావభావాలు అతనికి కనిపించకుండా - "అవునా .." అంటూ మనసారా నవ్వుతూ వివేక్ తోపాటు పబ్లిక్ గార్డెన్ బయటికి అడుగులు వేసింది పద్మ.
Katha chala chakkaga chadivichela raseru
Padma athanu rosu kalusukunnapudu friend ga thanaki Dr tho pelli vishayam chepthe bagundedi.
Athanu asa padda vishayam telusukuni athanu niritshaham kanapada kunda return ayithe oka baruvaina mugimpu la untundi.
Andariki raja rakala abhiprayam untayi.kani meeru kathalga malachatame great.
Balachader cinema mugimpu manaki vadilestharu.
—-Mrs sujana panth
Bheemaaram
HANAMKONDA.
ధన్యవాదాలు మేడం
Simple story very nice and beautiful
ధన్యవాదాలు
డాక్టర్ గారూ.
Dr.Thank you
For your response.
Nice…. చిన్న సింపుల్ కథ ఊహించని కొసమెరుపుతో👌👌👌
ధన్యవాదాలండి
సార్ నమస్కారం🙏
తెలుసి వచ్చిన మనసు…చిన్ని కథ అయినప్పటికినీ సంక్షిప్తంగా చక్కగా సాగింది.
ఈ కథ విన్న తర్వాత నాకొక సందేహం కలుగుతుంది. అన్ని విధాలుగా దగ్గరవుతూ, పద్మను ఇష్టపడుతున్న వివేక్ ఆమెకు వేరొక డాక్టర్ తో పెళ్లి సంబంధం కుదిరింది… అని తెలిసి కూడా పద్మకు ప్రేమ చిహ్నంగా పువ్వు ఇవ్వకుండా ఆపిల్ ఇవ్వటం వరకు కేవలం ఒక మంచి స్నేహితుడిగా సమంజసమే … కానీ రచయిత, వివేక్ తో “రోజూ ఆపిల్ పండు తింటే డాక్టర్ తో అవసరం ఉండదు” …అనే మాటలు చెప్పించడంలో ఉన్న భావాన్ని “ఆ డాక్టర్ సంబంధాన్ని వదులుకొని తనకు దగ్గరవు” … అని అన్నట్లుగా ఉంది అని నాభావన.
—-బి.రామకృష్ణా రెడ్డి,
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
రెడ్డి గారు
మీ స్పందన కు ధన్యవాదాలు
అద్భుతంగా ఉంది సార్ కధ. మలుపు ఎవరూ ఊహించని విధంగా అలవోకగా మలిచేశారు ఆద్యంతం ఆసక్తికరంగా ఆత్మీయంగా హృదయానికి హత్తుకుంది కధ .👌👌👌👌చిన్న కధ అయినా ఎవరికీ చిక్కని అర్థం. వాహ్ వాహ్ సార్ 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐🙏🙏
మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలండీ .
అద్భుతమైన ముగింపు ఇచ్చారు సర్ . కానీ అతనికి ఉపశమనం కూడ కలిగించి ఉంటే బాగుంఢేది. అంటే నిజం తెలిసేలా. అభినందనలు సర్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలు
Small ad nice one Sir
—-padmaja.jagadeeswar
Hyderabad
పద్మా
నీ స్పందన కు ధన్యవాదాలు
తెలిసొచ్చిన మనసు కథ ఆసక్తిగా, రసాత్మకంగా సాగింది.పద్మ, వివేక్ ఆలోచనలు మరియు ఆ ఆలోచనలలో దాగి ఉన్న పరిపక్వతని చక్కగా చెప్పారు.తక్కువ నిడివితో సరళమైన భాషతో అంచనాలకు అందకుండా కథ ముగించిన విధానం బాగుంది.నమస్కారములు సర్.
ధన్యవాదాలండీ
తెలిసొచ్చిన మనసు కథ చాలా బాగుంది.పద్మ, వివేక్ ఆలోచనలు మరియు ఆ ఆలోచనలలో దాగి ఉన్న పరిపక్వతను చక్కగా వివరించారు.సరళమైన భాషతో, తక్కువ నిడివితో చక్కగా సాగింది. హృదతపూర్వక నమస్కారములు సర్.
ధన్యవాదాలు సార్
కొసమెరుపు బావుంది సర్…
అవునా…
ధన్యవాదాలు అమ్మా.
చాలా సింపుల్గా మనసుకు తాకేలా వుంది mugimpuyemitiane ఉ త్కం ట.
———శ్రీమతి. విజయ
హైదరాబాద్.
విజయ గారు
మీ స్పందన కు
ధన్యవాదాలంఢీ
Its very difficult to understand women. Its proved again
మిత్రుమా,
నీ స్పందన కు ధన్యవాదాలు.
సిరిమల్లె
సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.