౧౨౬౧. తిరిగే కాలు తిట్టే నోరూ ఊరుకోవు ...
౧౨౬౨. తినగా తినగా వేపాకు తియ్యన.
౧౨౬౩. తినబోతూ రుచులు అడగనెందుకు?
౧౨౬౪. తినమరిగినమ్మ పెట్ట నేరుస్తుందా?
౧౨౬౫. తినే కూటిలో మన్ను పోసుకుంటారా?
౧౨౬౬. తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్లు...
౧౨౬౭. తిరిగి రైతన్నా, తిరక్క బైరాగి చెడతారు.
౧౨౬౮. తిరిగితే ఆడది, తిరక్కపోతే మగాడు చెడపోతారు.
౧౨౬౯. తీగ లాగితే డొంకంతా కదులుతుంది.
౧౨౭౦. తీగకు కాయ బరువు కాదు.
౧౨౭౧. తీటగలవానికి తోటగలవానికి తీరిక ఉండదు.
౧౨౭౨. తియ్యగా తియ్యగా రాగము, మూలగ్గా మూలగ్గా రోగము ఊపందు కుంటాయి.
౧౨౭౩. తీరు తీరు గుడ్డలు కట్టి తిరగడానికి పోతే, ఊరికో గుడ్డ ఊడబీకారుట!
౧౨౭౪. తుమ్ముకు తమ్ముడుండడు గాని, ఆవలింతకు అన్న ఉంటాడు.
౧౨౭౫. తులం నాలుకకు తొంభై తొమ్మిది రుచులు కావాలి!
౧౨౭౬. తులసి వనంలో గంజాయి మొక్క మొలిచినట్లు ...
౧౨౭౭ . ఒట్టిగొడ్డుకి అరుపు లెక్కువ...
౧౨౭౮ . తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే
౧౨౭౯ . గుర్రం గుడ్డిదైనా, దానికి దాణా తప్పదు ...
౧౨౮౦. రాట్నం వస్తోంది, బండి అడ్డు తప్పించండి - అన్నాట్ట!
సామెతల ఆమెతలు