౧౦౫౧. కూసే గాడిద వచ్చి, మేసే గాడిదని చెడగొట్టిందిట!
౧౦౫౨. కృష్ణలో స్నానానికి కొండుభొట్లు అనుమతి కావాలా ఏమిటి?
౧౦౫౩. కొంగ జపం దొంగ వేషం ...
౧౦౫౪. కొండెత్తు దూదిని తగలబెట్టడానికి గోరంత నిప్పురవ్వ చాలు.
౧౦౫౫. కొండంత దైవానికి గోరంత పత్రి !
౧౦౫౬. కొండ కొంచెమై అద్దంలో ఇమిడిపోతుంది.
౧౦౫౭. కొండను "డీ" కొట్టిన పొట్టేలులా ...
౧౦౫౮. కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక కాస్తా ఊడిపోయిందట!
౧౦౫౯. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు...
౧౦౬౦. కొడుకు మనవాడైతే చాలదు, కోడలు కూడా మనదవ్వాలి.
౧౦౬౧. కొత్తొక వింత, పాతొక రోత.
౧౦౬౨. కొనగా రానిది, కొసరితే వస్తుందా...
౧౦౬౩. కొన్నది వంకాయ, కొసరింది గుమ్మడికాయ!
౧౦౬౪. కొప్పు చక్కగా కుదిరితే, తల ఎటుతిప్పినా అందంగానే ఉంటుంది.
౧౦౬౫. కొరివితో తల గోక్కున్నట్లు....
౧౦౬౬. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు...
౧౦౬౭. కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకిందిట!
౧౦౬౮. గంగిగోవు పాలు గరిటెడైనా మేలే...
౧౦౬౯. గంగలో ఎన్నిసార్లు ముంచినా కాకి హంస అవ్వదు.
౧౦౭౦. గంజిలోకి ఉప్పు లేదని ఒకడు ఏడుస్తూంటే, పాలలోకి పంచదార సరిపోలేదని ఇంకొక డేడుస్తున్నాడుట!
౧౦౭౧. గట్టి ఆయుష్షు ఉంటే చాలు, గరిక నూరి పోసినా బ్రతుకుతాడు.
౧౦౭౨. గడచిన కాలము మేలు వచ్చు కాలము కంటే...
౧౦౭౩. గట్టుకు చేరి, పుట్టి తగలబెట్టినట్లు.
౧౦౭౪. గతి చెడినా మతి చెడరాదు.
౧౦౭౫. గతిలేనమ్మకు మతిలేని మొగుడు.
౧౦౭౬. గరిక మేసిన గాడిద చస్తుంది గాని, గరికకు చావు లేదు.
౧౦౭౭. గాడిదకు గడ్డిమేపి, ఆవు పాలు పితికాడుట!
౧౦౭౮. గాడిదల్ని కట్టి సేద్యం చేస్తూ, కాలితాపులకు జడిసిపోతే ఎలాగ?
౧౦౭౯. గాడిద సంగీతం విని ఒంటె మురిసిపోతే, ఒంటె చక్కదనాన్ని పొగడలేక గాడిద మూర్ఛపోయిందిట!
౧౦౮౦. గాలిని మూట కట్టగలముగాని, గయ్యాళి నోరు మూయించలేము.