౫౯౧. తలలు బోడులైనా తలపులు బోడులు కావు.
౫౯౨. తిలాదానం తలో పిడికెడు.
౫౯౩. పూజకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు.
౫౯౪. తొండ ముదిరి ఊసరవల్లి అయ్యిందిట!
౫౯౫. నీ ఎడమచెయ్యి తియ్యి, నా పుర్రచెయ్యి పెడతా - అన్నాట్ట!
౫౯౬. రొట్టె విరిగి నేతిలో పడింది.
౫౯౭. తన్నితే వెళ్లి బూర్ల గంపలో పడ్డాడు.
౫౯౮. మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు...
౫౯౯. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది.
౬౦౦. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు.
౬౦౧. పేడకుప్పకు దిష్టిమంత్రమా...
౬౦౧. ఒకటో రోజు వరహా చుట్టం, మరుసటిరోజు మాడ చుట్టం, మూడవరోజు మురికి చుట్టం ...
౬౦౨. తినగా తినగా గారెలు చేదవుతాయి.
౬౦౩. అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటే, ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడిందిట!
౬౦౪. లోకం నోరు ముయ్యడానికి చాలిన మూత లేదు.
౬౦౫. నూరుమందికి మేలు నువ్వు కోరితే, నీకు ఒకమేలు జరుగుతుంది.
౬౦౬. నవ్విన ఊళ్ళే పట్నాలౌతాయి.
౬౦౭. నవ్విన నాపచేలే పండుతాయి.
౬౦౮. ఎదురెత్తులు వేస్తేనే చదరంగం.
౬౦౯. తోసిరాజు, ఆట కట్టు!
౬౧౦. నక్క ఒకచోట గౌరీ కల్యాణం, మరోచోట ఈలపాట పాడదు, ఎప్పుడూ ఊళలే వేస్తుంది.
౬౧౧. మేకతోలు కప్పుకున్నంతమాత్రాన పులి స్వభావం మారదు.
౬౧౨. "పూసీ, కాసీ చేలో పులి పడిం"దంటే, " లేదు, అన్నాచెల్లెలి గట్టు అడ్డుపడింది" అందిట!
౬౧౩. నిండా మునిగాక ఇంక చలి ఏమిటి?
౬౧౪. రాళ్ళు దేవుళ్ళయితే రాసులు మింగవా...
౬౧౫. ఉరుము ఉరిమి మంగలం మీద పడిందిట.
౬౧౬. అప్పుచేసి పప్పుకూడు అనర్ధానికి హేతువు.
౬౧౭. ఐనవాళ్లకి ఆకుల్లో, కానివాళ్ళకు కంచాల్లో ...
౬౧౮. అమ్మ అల్లం, పెళ్ళాం బెల్లం.
౬౧౯. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ.
౬౨౦. నక్కెక్కడ, నాగ లోక మెక్కడ!