౩౫౧. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి.
౩౫౨. ఇంటిని చూస్తే ఇల్లాల్ని చూసినట్లే.
౩౫౩. లోతు తెలుసుకుని మరీ స్నానానికి దిగాలి.
౩౫౪. అన్నీ కలవాడు అందలం ఎక్కితే, సాటికోసం సరప్ప చెరువుగట్టు ఎక్కాడుట!
౩౫౫. ఊర్లోవాళ్ళు ఉన్నవన్నీ ఎండేసుకుంటే, ఎలక తన తోక ఎండేసుకుందిట!
౩౫౬. బిడ్డతల్లి బిడ్డకు పాలిచ్చి వచ్చేసరికి గొడ్రాలు గోనెడు వడ్లు దంచిందిట!
౩౫౭. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగర గలదా?
౩౫౮. అయ్యవారు ఏమి చే స్తున్నారు - అంటే, చేసిన అవకతవకల్ని సరిదిద్దుకుంటున్నారు - అన్నారుట!
౩౫౯. కురూపీ, కురూపీ! నీ పనేమిటిరా - అని అడిగితే, సురూపాలకి వంకలు పెట్టడమే నా పని - అందిట!
౩౬౦. నలుపు నాలుగు వంకల్ని తెస్తుంది, ఎరుపు ఏడు వంకల్ని దాస్తుంది.
౩౬౧. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు...
౩౬౨, పుణ్యానికి పుట్టెడు వడ్లు కొలుస్తానంటే, కుంచం పిచ్చకుంచం కాదుకదా - అని అడిగాడుట!
౩౬౩. విద్య లేనివాడు వింత పశువు ...
౩౬౪. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!
౩౬౫. సంసారం ఒక చదరంగం!
౩౬౬. అన్నీ ఉన్నాయి గాని అయిదవతనం తక్కువయ్యింది.
౩౬౭. మొగుణ్ణి కొట్టి , మొగసాలకు మొర పెట్టిందిట!
౩౬౮. పెట్టినమ్మకి పుట్టిందే సాక్షి
౩౬౯. పిల్లికి చెలగాటం, ఎలక్కు ప్రాణ సంకటం.
౩౭౦. పులినిచూసి నక్క వాతలు పెట్టుకుందిట ......
౩౭౧. గతిలేనమ్మకి మతిలేని మొగుడు.
౩౭౨. గతిలేనమ్మకి గంజేపానకం ...
౩౭౩. ఎంత ఏనుగైనా ఏదో ఒక సమయంలొ కాలు బెసక్కపోదు.
౩౭౪. తాతకా ధగ్గులు నేర్పడం !
౩౭౫. పాము చిన్నదైనా, కర్ర పెద్దధి ఉండాలి.
౩౭౬. కుక్కని సింహాసనం ఎక్కించినా, దాని దృష్టి చెప్పుల మీదే!
౩౭౭. ఒకేజాతి కొంగలు ఒకేచోట గూళ్ళు కడతాయి.
౩౭౮. ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీలమోత.
౩౭౯. చీకటికి నక్షత్రా లెక్కువ, దరిద్రానికి పిల్లలెక్కువ.
౩౮౦. ఆశ అందలం ఎక్కమంటుంటే, రాత గాడిదల్ని కాయించింది.