౨౩౧. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిందిట!
౨౩౨. పిల్లి దుఃశ్శకునం.
౨౩౩. కూసే గాడిదవచ్చి మేసే గాడిదను చెడగొట్టిందిట!
౨౩౪. ఆశ లావు, పీక సన్నం!
౨౩౫. ఇంట్లో వండిన ఇగురు కూరకన్నా, పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ.
౨౩౬. పచ్చి కాయ యిట్టే పగులుతుంది.
౨౩౭. అత్తింటి కోడలు, ఆకుచాటు పింది ఒకటి.
౨౩౮. మూడు పూవులకు ఆరు కాయలు!
౨౩౯. నక్కని తొక్కి వచ్చాడన్నమాట!
౨౪౦. మొహమాటానికిపోతే మొదటికే మోసం వచ్చిందిట!
౨౪౧. మొండికెత్తినమ్మని మొగుడేమి చెయ్యగలడు!
౨౪౨. మొండి కెత్తినమ్మ మొగుడు పెళ్ళికి వెళ్లి అర్ధగోడ చాటున నిలబడి, అర్థరూపాయి కట్నం చదివించిందిట!
౨౪౩. నిండు కుండలోని నీరు తొణకదు.
౨౪౪. వడ్లగింజలో బియ్యపు గింజ!
౨౪౫. కొలువు తప్పించుకోవాలని క్రోసేడు దూరం పరుగెడితే, కొరివిదయ్యం వెంట తరిమిందిట!
౨౪౬. కూచమ్మ కూడపెడితే, మాచమ్మ మాటున మాయం చేసిందిట!
౨౪౭. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం ...
౨౪౮. ఎద్దు పుండు కాకికి నొప్పా?
౨౪౯. నిదానమే ప్రధానం.
౨౫౦. తెగించిన వానికి సముద్రం కూడా మోకాలి లోతే అనిపిస్తుంది.
౨౫౧. చవుటి పర్రలో సముద్రమైనా ఇంకిపోతుంది.
౨౫౨. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపంగినూనె కావాలన్నాడుట!
౨౫౩. చెరకు తిన్న నోరు చెదు తినదు.
౨౫౪. తల్లి అల్లం, పెళ్ళాము బెల్లం!
౨౫౫. అరచేయి అడ్డం పెట్టి ఆకాశాన్ని ముయ్యగలమా?
౨౫౬. దొంగలూ దొంగలూ చేరి ఊళ్లు పంచుకున్నారుట!
౨౫౭. కుంచమంత కూతురు ఉంటే చాలు, మంచం మీదే కూడు.
౨౫౮. పొయ్యి పక్కనే పొలం ఉండాలంటే ఎలా కుదురుతుంది?
౨౫౯. కతికితే అతకదు.
౨౬౦. దగ్గరగా పిలిచి, దాసరీ! నీకన్ను గుడ్డి - అన్నాట్ట!