“సువిధ” వారి “శాక్రావధానము-2019”నకు అందరికీ మా ఆహ్వానమిదే!
తెలుగు చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా, స్వర్ణలోయ లోని శాక్రమెంటో నగరంలో, శనివారం, జూలై 13 మ. 3 గం. లకు లక్ష్మీనారాయణ స్వామి మందిరము నందు మొట్టమొదటి త్రిగళావధానము జరుగనున్నది! అంటే … ముగ్గురు అవధానులు, ఒకే వేదిక మీద, ఒకే సమయములో - మూడు వేర్వేరు భాషలలో అవధానం చేయబోతున్నారన్నమాట!
శతావధాని శేఖర, కాశీ కవి, అచ్చ తెలుగు అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదు గారు అచ్చ తెలుగులో, సంస్కృతాంధ్రావధానులు శ్రీ పాలడుగు శ్రీచరణు గారు సంస్కృతములో, ప్రవాసాంధ్ర అవధాని ప్రభాకర శ్రీ నేమాని సోమయాజులు గారు ఆంధ్రము (సంస్కృతముతో కూడిన తెలుగు)లో అవధానం చేయబోతున్నారు.
ఈ కార్యక్రమమునకు సంచాలకత్వము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రజ్ఞా భాస్కర, వ్యాస భారతి, ఆచార్య శ్రీ రాణి సదాశివ మూర్తి గారు (డీన్ ఆఫ్ అకడిమిక్ అఫైర్స్, సాహిత్య విభాగాధ్యక్షులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠము, తిరుపతి) వహించబోతున్నారు.
అంతే కాకుండా, ముఖ్య అతిథిగా, తమిళ నాట పుట్టి తెలుగున పురాణములతో సహా ఎన్నో రచనలు చేసిన శ్రీమతి జయలక్ష్మి గారి కుమారులు శ్రీ శ్రీనివాసుగారు విచ్చేయుచున్నారు.
ఈ మహత్కార్యము ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది - అయినా లెక్క చేయక స్వయంసేవకులమందరమూ తలొక చెయ్యి వేస్తూ ముందుకు నడుస్తున్నాము … కానీ మీ చేయూత ఏంతో అభిలషణీయము … తప్పక మీ వంతు సాయము ఈ లంకె ద్వారా చేయగలరు...
ఉచిత ప్రవేశము, ఉచిత అల్పాహారము! తప్పక చేరిరాగలరని విజ్ఞప్తి …