Menu Close
Kadambam Page Title
ఓ వెన్నెల రాత్రి కోసం
గవిడి శ్రీనివాస్

చాలా కాలమే అయింది
కాసిన్ని నవ్వులు పూసి
వెన్నెల దోబూచులాడి
సిగ్గుపడే చుక్కలతో మాట్లాడి
కొద్దిగా కొరికే చలిగాలుల్లో ఈదులాడి
ముచ్చట పడే మేఘాల్లో తేలి
చాలా కాలమే అయింది.

ఇన్ని దినాలు ఎన్ని వర్షాలు
నాలో ఒంపుకో లేదూ ...!

ఊసులు కొసరుతుంటే
ఎన్ని చలి మంటలు
గుండెల్లో దాచుకోలేదూ....!

మౌనం పెగలక
ఎన్ని ఎండలకి తడిసినా...
కాసింత కాలం నడిచాక
ఏదో చల్లని సమీరం
ఆకుల వెంబడి తాకింది.

వెన్నెల వేలాడ దీసే పక్షుల్ని
మబ్బులు అల్లిన రంగవల్లుల్ని
చీకటిని  తొలిచే మిణుగురుల్ని
అదే పనిగా చూస్తున్నాను.

కొంత ప్రయాణం సాగాక
ఈ నిర్లిప్త  క్షణాల్లో
ఓ వెన్నెల రాత్రి కోసం
ఆశను పరచుకొని
నీలి ఆకాశం వంక
ఇంకా ముచ్చటగా వీక్షిస్తున్నాను.

Posted in July 2021, కవితలు

2 Comments

  1. నరేంద్ర బాబు సింగూరు

    వెన్నెల్లో.. చుక్కలతో మీ మనసు బాసలు .. బాగుంది

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!