Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

నిన్న లేని అందమేదో

కొన్ని పాత తెలుగు పాటలను విన్నప్పుడల్లా మన తెలుగు భాషలోని తేనే మాధుర్యం ప్రస్ఫుటంగా కనపడుతుంది. కారణం అందులోని భావుకత, సాహిత్య సమాహారము. పదాలు చాలా సులభతరంగా అర్థమౌతాయి. ఆ పదాలతో అల్లిన హారం చక్కగా అమరి, మంచి అర్థవంతమైన సాహిత్య విలువలను ప్రతిబింబిస్తుంది. అటువంటిదే ఈనాటి ఈ పాట. నూతన ఆంగ్ల సంవత్సర సందర్భంగా మీకోసం అందిస్తున్నాము.

movie

పూజా ఫలము (1964)

music

సి. నారాయణ రెడ్డి

music

సాలూరి రాజేశ్వర రావు

microphone

ఘంటసాల వెంకటేశ్వర రావు

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. ఓ..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

చెలినురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

పసిడి అంచు పైట జార..ఆ.ఓ..ఓ
పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

Posted in January 2025, పాటలు