ఉగాది వేడుకలు జరుపుకుందామని డేవిడ్ ని, ఇస్మాయిల్ ని ఇంటికి ఆహ్వానించాడు రాము.
"ఉగాదికి మీ ఇంటికి మేము వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో" అని అన్నారు డేవిడ్, ఇస్మాయిల్.
"అదేమీ లేదు మా ఇంట్లో అలాంటి పట్టింపులు వుండవు, మా ఇంట్లో మత పట్టింపులు వుండవు" అని అన్నాడు రాము.
"సరే మాకు కేక్,సమోసా,జిలేబి లాంటివి వుంటే పెడతామంటే వస్తాం" అని నవ్వుతూ అన్నారు డేవిడ్, ఇస్మాయిల్.
"మీకు నచ్చినవి ఏర్పాటు చెస్తాం...రండి"అని అన్నాడు రాము.
ఉగాది రోజు ఉదయాన్నే రాము ఇంటికి డేవిడ్,ఇస్మాయిల్ వచ్చారు.
రాము తాతయ్య నాగమయ్య ఉగాది గొప్పతనం గురుంచి, తెలుగువారికి ఉగాది ప్రాధాన్యతను వివరించాడు.
రాము నాన్నమ్మ ఉగాది పచ్చడిని అందరికీ పంచి పెట్టింది.
ఉగాది రోజు మా ఇంటికి వచ్చారు ఈరోజు మీకు ఇష్టమైన కేక్, సమోసా, పులిహోరా ఏర్పాటు చేసాను తినండి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ" అని రాము అమ్మ.
"ఉగాది రోజు కేక్ " అని ఆశ్చర్యంగా అడిగాడు రాము.
"అవును... వెజ్ కేక్ " అని అంది అమ్మ నవ్వుతూ.
"నాన్న నాకు మా అక్కకి కొత్త బట్టలు తెస్తాడు ఈరోజు... అవి వేసుకొని సరదా పార్క్ కి వెళ్తాం" అన్నాడు రాము.
"నాన్న నీకో సర్ప్రైజ్... ఇస్తారు చూసుకో" అని అంది అమ్మ.
"సర్ప్రైజ్... వాట్ " అని అడిగాడు రాము.
"కొంచెపు ఆగు నీకే తెలుస్తుంది" అంది అమ్మ.
నాన్న కొత్త బట్టలు తెచ్చాడు.
"అక్కకు ఒక జత, నీకు ఒక జత, డేవిడ్ కి ఒక జత, ఇస్మాయిల్ కి ఒక జత బట్టలు సరేనా" అని నవ్వుతూ బ్యాగ్ లోంచి బట్టలు తీసాడు రాము నాన్న.
రాము కళ్ళలో నీరు తిరిగాయి... నాన్న వైపు కృతజ్ఞతా భావంతో చూసాడు.
"నువ్వే చెప్పావు కదా నేను కొత్త బట్టలు వేసుకున్నరోజు... అక్క... అలాగే నా ఫ్రెండ్స్ కొత్త బట్టలు వేసుకుంటేనే నాకు సంతృప్తిని అందుకే ఈ ఏర్పాట్లు చేసాను" అని నవ్వాడు నాన్న.
"అంతే కాదు నీ పుట్టినరోజునాడు.. నీ క్లాస్ లోని పిల్లలందరికీ కొత్త బట్టలు తీస్తానని నాన్న చెప్పారు" అని అంది అమ్మ.
"ఇది నిజమైన పండగ... మనతో పాటు అందరూ ఆనందంగా ఉన్ననాడే నిజమైన పండగ" తాతయ్య.
"ముందు ఈ పాయసం తినండి సరదాగా అందరూ" అని పాయసం తెచ్చింది నాన్నమ్మ.
అక్కడ అందరి ముఖాల్లోనూ ఉగాది పండగ కనపడింది.