నేను
పిల్లల ఆకలిని గ్రహించి
దానిని తీర్చేవేళలో అమ్మని.
కార్యార్ధమై వాళ్ళు వెళ్తున్నప్పుడు
సరియైన సలహాలిచ్చేవేళలో నాన్నని.
వాళ్ళు అశాంతితో అలమటించేటప్పుడు
ధర్మానికి, అధర్మానికి తేడా చెప్పి
వాళ్ళ దారిని సరిచేసే వేళలో గురువుని.
వాళ్ళ ఆలనాపాలనా, మంచిచెడులు చూసి
వారికై ప్రేమతో పరితపించే వేళలో దైవాన్ని.
వాళ్ళు తెలుసుకున్నా, తెలుసుకోలేకున్నా
వాళ్ళఆనందానికి మూలాన్ని,
వాళ్ళు పడాల్సిన గర్వాన్ని,
తెలుసుకోవలసిన నిజాన్ని,
తలుచుకోవలసిన గతాన్ని,
వారికై నిలిచిన హితాన్ని, సమ్మతాన్ని.