

ఎగిరే ఆ గాలి పటాల మీద...
ఎగిరే ఆ ఎర్రజెండాల మీద...నా పేరుంటే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ చల్లని సముద్రగర్భంలో
ఆణిముత్యమై...నా ఊరు ఉంటే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ ఎర్రని సూర్యకిరణాలలో...
ఆ చల్లని చంద్రబింబంలో...నా ఊరుంటే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ నీలి మేఘాల్లో...
ఆ నవ్వే నక్షత్రాల్లో...నా పేరు ఉంటే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ కొండ కోనల్లో...
ఆ పర్వత శిఖరాలపై...నా ఊరు ఉంటే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ గలగల పారే సేలఏరుల్లో...
ఆ జలజల దూకే జలపాతాల్లో...
ఆ పచ్చని పంట పొలాల్లో...
నా " పేరు నీరై " ప్రవహిస్తే...
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఆ ఆకలి కడుపుల్లో...
ఆ మండే గుండెల్లో...నా పేరు ప్రతిధ్వనిస్తే
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
ఎగిరే ఆ పక్షుల రెక్కల్లో
నా పేరు రెపరెప లాడితే...
ఎంత బాగుండు..?ఎంత బాగుండు..?
తరతరాలకు చెక్కుచెదరని
శిలాఫలకాలపై నా ఊరు నా పేరుంటే...
ఎంత బాగుండు..? ఎంత బాగుండు..?
అలాగుండాలని...
ఊహల్లో తేలిపోవడం ఉన్మాదం..!
కసితో కృషితో పటిష్టమైన ప్రణాళికతో
ఆశయ సిద్దికై అహర్నిశలు శ్రమించడం..!
ఉత్తమం...ఉత్కృష్టం...ఉపయోగకరం..!
పర్వత శిఖరాలపై వూరు వుంటే ఎలా ఎక్కుతారు బాబూ ! అందుకే చివర్లో ఊహల్లో తేలిపోవడం ఉన్మాదం అని తేల్చి వేశారుగా!