Menu Close
మనోల్లాస గేయం
- మధు బుడమగుంట -
Song

మువ్వలా నవ్వకలా

movie

పౌర్ణమి (2006)

music

దేవిశ్రీ ప్రసాద్

music

సిరివెన్నెల

microphone

బాలసుబ్రహ్మణ్యం, చిత్ర

మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధా సింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేశావే

నన్నిలా మార్చగల కల నీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే

కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో

నన్నిలా మార్చగల కలనీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకు మా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేశావే

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరి ఒక జన్మగా మొదలవుతున్నదా
ఓహ్
పూటకో పుట్టుక నిచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా

మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
ఆశకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే

Posted in November 2025, పాటలు