కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కలియుగ వైకుంఠ దైవం ఆ శ్రీనివాసుడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు. వడ్డీ కాసుల వాడు, కోరిన వరాలు తీర్చేవాడు. ఆ దేవదేవుని స్తుతిస్తూ 16 వ శతాబ్దంలోనే వేల కొలది పాటలను రచించిన మన తెలుగు జానపద కవిబ్రహ్మ, పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య, మనందరికీ ఆదర్శమూర్తి, స్ఫూర్తి. ఆయన కలంనుండి జాలువారి, ఆ మహానుభావుడు తన గొంతుతో ఆ శ్రీనివాసుని స్తుతించిన ఈ మధుర గీతం, ఇప్పుడు ఉన్నికృష్ణన్ గారు తమ గళం నుండి వినిపించారు.
గానం: ఉన్నికృష్ణన్
పల్లవి:
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
చరణం 1:
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
కుమ్మర దాసుఁడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు చేసినయట్టి తొండమాం జక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
చరణం 2:
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు...
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడుబి
కొండలంత వరములు గుప్పెడు వాఁడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు