నేను కోడిపెట్ట లాంటిదానిని.
గుడ్డు(పసి)దశలో ఉన్న నా పిల్లల క్షేమాన్ని
నాప్రేమతో పొదిగిపెట్టుకొని,
ఎదుగుతున్న అందమైన వారి బాల్యాన్ని
నాగుండెల్లో పొదివిపట్టుకొని,
ఎదురౌతున్న ప్రమాదాలను పక్కకు నెట్టుకొని,
ఎదలోఉన్న ప్రమోదాలను ఆకట్టుకొని,
వారి లాలిని జాలితో జోలలాపాడి
వారికింకలను ఆపమని బేలనై దైవాన్నివేడి,
వారిపాలనే నాకర్తవ్యంగా భావించి
వారిపోషణే నాపరమార్ధంగా ఉద్యోగంగా జీవిస్తున్న
కోడిపెట్ట లాంటిదానిని.
నా రెక్కలు నా పిల్లల సంరక్షణకొరకే,
నా హక్కులు నా పిల్లల సంప్రోక్షణకొరకే,
నా అరుపులు వారిని మేలుకొల్పటానికే,
నా ఆరాటం వారి అలుపు బాపటానికే.
వారి రక్షణ, శిక్షణ నాకు ఒకయాగం,
వారి యోగక్షేమాలే నాకు ఒక యోగం.
నా పిల్లలగూర్చిన ఆలోచనతప్ప నాకింకేమీ తెలియదు,
వారి ఆలోచనలతో నామనసెప్పటికీ అలియదు.
నేను కోడిపెట్ట లాంటిదానిని