క్షణికం ....!!
నాన్న అరిచాడని,
అమ్మ తిట్టిందని,
మాష్టారు కోప్పడ్డాడని,
స్నేహితులు ఇష్టపడడం లేదని,
పాఠాలు అర్దం కావడంలేదని,
క్లాసులో ..పరువు పోతుందని,
అమ్మానాన్నల ఆశయాలకు
న్యాయం చేయలేకపోతున్నామని,
కోరుకున్న అమ్మాయి ప్రేమించటం లేదని,
మాటిచ్చిన ప్రేమికుడు మాట మార్చేసాడని,
తమ పవిత్ర ప్రేమను
ధన, కుల, మతాలకు ముడిపెట్టి,
తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని,
పేదరికం ప్రేమకు అడ్డువస్తోందని,
కోరిన కోర్కెలు
అమ్మానాన్నలు తీర్చడం లేదని ..
ఇక జీవితమే వ్యర్థమని ....
క్షణికావేశం తో ..
ఆత్మహత్యలను ఆశ్రయించడం..
అర్థంలేని ఆలోచన!
ఏదైనా ....
బ్రతికుండి సాధించడమే ,
జీవితానికి ---
పరమార్ధం, ప్రాయోజితం !!
సార్.. సిరిమల్లె లో మీ కవిత బాగుంది.
—–కె.బాపూజీ
హైదరాబాద్
ధన్యవాదాలు సర్
Excellent message👌👌
ఝాన్సీ గారు
మీ స్పందన కు
ధన్యవాదాలు.
అర్ధవంతమైన ,ఆవశ్యకమైన కవిత సర్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలు
మంచి సందేశాత్మక కవిత సర్ . ధన్యవాదములు
సాగర్
ధన్యవాదాలు
సిరిమల్లె
సంపాదక వర్గానికి
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయపూర్వక ధన్యవాదాలు
బాగుందండీ ప్రసాద్ గారు.చక్కని కవిత.
ధన్యవాదాలు
బాపూజీ గారూ.