గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
18. మీనాక్షి శ్రీనివాస్
అంశం:: కథ మొదలు మాది_ముగింపు మీది. కథా శీర్షిక : మనసుంటే మార్గం సుగమం...
శాంతమ్మ ఆలోచన అప్పటికి ఒక కొలిక్కి వచ్చింది.
తను పెళ్ళికి ముందు కచేరి చేయగల స్థాయి ఉండేది. స్వయంకృతమో, ప్ర్రార్రబ్దమో కానీ, పెళ్లయిన తరువాత గొంతు విప్పిందే లేదు. ఇప్పుడు, ఇన్నేళ్లకు, ఇన్నాళ్లకు తనకు వచ్చిన ఈ స్వేచ్ఛ వృధా కాకూడదు.
తను ఇప్పటికీ పాడగలదు. ఎటొచ్చి, ఎవరు ఏం అనుకుంటారో అన్న వెరపు వదిలెయ్యాలి.
కొడుకు, కోడలు సంతోషంగా చెప్పారు...'మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి' అని. ఎటొచ్చి కూతురుకే అన్నీ వాళ్ళ నాన్న పోలికలే. తనంటే చిన్న చూపు. అలసత్వం. ప్చ్! పోనీ దాని ప్రోత్సాహం ఎవరికి కావాలి?
అంతే, ఆ రోజే మళ్ళీ సాధన మొదలుపెట్టింది.
ఇప్పుడు అన్నీ సులభంగా యూ ట్యూబ్ లో దొరికేస్తున్నాయి. తను చాలా సశాస్త్రీయంగా నేర్చుకుంది, ఏదీ మరచిపోలేదు. ఒకసారి నెమరువేసుకుందుకు వింటే చాలు.
అంతే ఆ రోజునుంచీ ఒంటరితనం ఆమె దరి చేరలేదు. సాధనతో సమయమే తెలియడం లేదు. ఆమెను తెలిసిన వారంతా పెదవి విరిచారు. 'ఈ వయసులో కచే్రీలు చేస్తుందా? సినిమాలో పాడుతుందా అంటూ!'
వాళ్లకేం తెలుసు? అదొక అలౌకికమైన ఆనందం. ఆత్మానందాన్ని మించినదేముందీ?
కానీ ఆమె గురించి ఆ నోటా, ఆ నోటా తెలిసిన ఒక సంగీత ప్రియుడు, ఆమెతో పాడించి ఆల్బమ్స్ విడుదల చేసాడు. ఇప్పుడామె ఎందరికో ప్రియమైన సంగీత కళాకారిణి. క్షణం తీరికలేని సంగీతజ్ఞురాలు.
*****
19. కనక దుర్గ
అంశం :: కథ మొదలు మాది_ ముగింపు మీది; శీర్షిక : నా నిర్ణయం నాదే ..
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసునుప్రశ్నించుకుంది.
అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయా యి. వీటితో పాటుగాఅనారోగ్యం...శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.
కంటికొలకు ల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది. ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
***
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయంకొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు, "ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
*******
ఇక మిగిలిన నా కథ..
చుట్టుప్రక్కల వాళ్ళు ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
స్త్రీగా ఏమి నిర్ణయం తీసుకున్నా దానికి ఎవరి ఇష్టం వచ్చిన ఆలోచన వారు చేసుకుంటూ పోతే 60 ఏళ్ళ వయసులో కూడా స్వేచ్ఛ లేని జీవితం నరకమే కదా!?
నా ఒంటరితనాన్ని కూడా పిల్లల కోసం ధారపోసినా.... "కన్నందుకు నీ బాధ్యత" అన్నారు.
"పెళ్లిళ్లు చేసి వారిని ఒక దారిన పెట్టాల్సిన కర్తవ్యం నీదే"అన్నారు.
"వయసు అంతా తెలియకుండానే కరిగిపోయింది. కరిగిపోయిన యవ్వనాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేను... ఇప్పటివరకు లేని మగ తోడు మళ్లీ జీవితంలో తెచ్చుకొని వారికి మళ్ళీ బానిసగా ఉండలేను. అందుకే ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను. పుట్టిన దగ్గరనుండి 60 ఏళ్ల వరకు జీవితం నాకు తెలియకుండానే ఎవరెవరి కోసమో అంకితం చేశాను.
ఇక 60 ఏళ్ల తర్వాత జీవితం అంతా దేవుడు ఇచ్చిన బోనస్ అందుకే నా జీవితం ఆ దేవుడికే అంకితం. ఆ కృష్ణుడులో ఐక్యమయ్యే వరకు ఆయనకే నా జీవితాన్ని అంకితం చేస్తాను, సన్యాసం స్వీకరిస్తానన్నా కూడా, పోయేకాలమా!?"..
విదేశీయులు మనలా సంప్రదాయంగా మారిపోతూ,ఆ దేవదేవుడికి దగ్గరగా చేరువవుతున్నారు.. మనం విదేశీయులుగా వారి అలవాట్లలో కూరుకుపోతున్నాము. అందుకే జనాలకి నేను తప్పు చేస్తున్నట్లుగా మూతి విరుపులు, వంకర మాటలు... 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటున్న సమాజంలో ఉన్న మనం ఇలాంటి మాటలు తప్పేమో అనిపించింది..
ఒక చిన్న చిరునవ్వు నా పెదవిమీద విరిసింది...
"ఏ విహంగానికైనా వినీలాకాశంలో విహరించటమే స్వేచ్ఛ!!" నా స్వేచ్ఛ నాకు కావాలి..
"సమాజం అంతే వారికి ఏమి కావాలో వారికే తెలియదు.ఎదుటివారు ఏమి చేసినా ఒక్కవేలు చూపుతారు.
నాలుగు వేళ్ళు వారిని చూపిస్తున్న సంగతి మర్చిపోయి".
******
17. వి.వి.వి.కామేశ్వరి
అంశం: కథ మొదలు మాది_ముగింపు మీది. కథా శీర్షిక: విజయమార్గం
ఆరుపదుల వసంతాలు చూసిన శ్యామలమ్మకు, ఒంటరితనం కొత్తేమీకాదు. కానీ ఈ మధ్య కాలంలో... 'తాను ఒంటరి' అనే ఫీలింగ్ పవర్ ఆఫ్ పట్టా పుచ్చుకొని గుండె సింహాసనం మీద, తిష్ట వేసుకుని కూర్చుంది. 'ఇన్నాళ్లు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది?' అని పదే పదే తన మనసును ప్రశ్నించుకుంది.
అది...
'అప్పుడు బాధ్యతలు తోడుగా ఉండేవి. ఇప్పుడు అవి తీరిపోయాయి. వీటితో పాటుగాఅనారోగ్యం..శరీరంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఇప్పుడేగా! ఇంట్లో నాకు ఉన్న విలువ నాకు తెలిసేది. మరి ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాను!?!' అని తనకు తాను జవాబు చెప్పుకొంది.
కంటికొలకుల్లో దాగిన రెండు కన్నీటిబొట్లు ఆమె బుగ్గల పైకి ప్రాకాయి. గతం ఆమె కళ్ళ ముందు మెదిలింది.
***
పెళ్లయిన నాలుగేళ్లకే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళోపెట్టి పరారు అయిపోయాడు శ్యామలమ్మ మొగుడు పరాంకుశం.
"నా కొడుకును వీధులపాలు చేసిన నీవు మాఇంటికి ఏమొహం పొట్టుకొని వస్తావు? నువ్వూ, నీ పిల్లలూ కట్ట కట్టుకొని ఏచావన్నా చావండి. మాకు మీకు ఎటువంటి సంబంధం లేదు," అని తెగేసి చెప్పేసి, ఆమెను... ఆమె పిల్లల్ని ఇంట్లోకి రానీయకుండా తలుపు మొహం మీదే వేసేసారు ఆమె అత్తింటి వారు.
పుట్టింటికి వెళ్ళటం ఇష్టం లేని శ్యామలమ్మ. ఒక కాన్వెంటు లో టీచర్గా జాయిన్ అయ్యి, తిని తినక ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసుకుంది.
ఇప్పుడు పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు వాళ్ళవి.
***
కళ్ళ నీళ్లు తుడుచుకుంది. మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యింది. తన నిర్ణయంకొడుకూ, కోడలికి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు కొడుకు. మీ ఆనందమే మా ఆనందం అని చెప్పి తప్పుకుంది కోడలు. కూతురుతో ఈ మాటే చెబితే... జవాబు చెప్పకుండా, ఫోన్ కట్ చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు,
"ఈ వయసులో ఈవిడకు ఇదేం పోయేకాలం?" అని అన్నారు.
*******
నా ముగింపు:
పడిలేచిన అలలా ఉత్సాహం నింపుకుని “డెమో” ప్రదర్శిస్తున్న శ్యామలమ్మను చూసిన, బోసి బుగ్గల బామ్మలు అబ్బురంగా బుగ్గలు నొక్కుంటూ అనుకుంటున్నారు.
“ఏదో తక్కువగా అంచనా వేశాము. కొందరికి అరవైలో ఇరవై వస్తుందని వినటమే గానీ, ఇంత వరకూ చూసింది లేదు. ఇదుగో… ఇప్పుడు… ఇక్కడ… ఈ వేదిక మీద చూస్తున్నాము. మనం కూడా పాత చింతకాయ భావాలకు స్వస్తి చెప్పాలి ఆవిడలా” అని.
వయోభేదం లేదన్న ప్రకటన చూసి, అక్కడకు వచ్చిన భామలు, పైన పడుతున్న వయసును పట్టించుకోకుండా పక్కనపడేసి స్త్రీ జాతికే గర్వకారణమనిపించేలా… చకచకా కట్లు, అల్లికలు, ఒత్తులు మొదలుకుని, అయిదు నుంచీ పది నిమిషాల్లో చిరుతిళ్ళను తయారుచేసుకోవటానికి వీలుగా ఇన్స్టంట్ మిక్సర్ల తయారీ మొదలైన ఆసక్తికర విషయాలపై, శిక్షణా తరగతుల ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ పెద్దావిడ చేసిన ప్రసంగం, చాకచక్యంగా పనిచేసే తీరు నచ్చి,
“ఆహా! ‘సాధికారత’కు అసలైన అర్థం, శ్యామలమ్మ గారి రూపంలో కనిపిస్తోంది” అనుకుని ఆవిడ వంకే చూస్తున్నారు విస్మయంగా.
‘తను మరొకరికి భారం కాకుండా, ఎవరికీ తలవంచక, ఒంటరితనాన్ని జయించటమే కాక, మరో పదిమందికి ఉపాధిని కల్పిస్తానని, తన మెడలో మిగిలిన చంద్రహారాన్ని తాకట్టు పెట్టి సొమ్మును తెచ్చిన తన నిర్ణయం సరైనదే!’ అనుకున్న శ్యామలమ్మ వదనంలో విరిసింది, విజయ దరహాసం. జాయినవుతూ రిజిష్టరులో సంతకాలు పెట్టిన వారి లిస్టు చూసిన తృప్తితో.
*****