కలలన్నీ అలలై
కలలన్నీ అలలై ఎగిసెగిసిపడుతూ,
మనసనే కడలిలో, మభ్యపెట్టి మునిగిపోయి
కరిగిపోతున్నాయి.
కలలన్నీ కోరికలై, కొదమసింహంలా పరు
పెడుతూంటే, కనిపించని ఎత్తు పల్లాల్లో
మనిషి తారాడుతున్నాడు.
కలల సాకారం కరువైపోతూంటే,
అందని ద్రాక్షలా మాయమై,
సత్యపు ఆనవాళ్ళు సమిసిపోతుంటే,
అసత్యభావాలు అనుభవంతో దగ్గరౌతున్నాయి.
కలలన్నీ ఆశలాయె,ఆశలన్నీ ఆవిరాయె,
విలువలన్ని విడ్డూరమాయె, వికృతాల విలాసమాయె,
విషమ పరిస్థితుల నడుమ మనిషి విలయ తాడవమాడుతుంటే,
మనసు కడలి రమ్మంటూ ఆహ్వానిస్తూంది.