

జంటస్వరస్వాగతము
తే.గీ. ఏకవర్గంబు(1), రెండింటి హెచ్చవేత(2), మూఁడు వర్గాల కూడిక(3), మొట్టమొదటి నవఘనంబుల కలయిక(4), నవ్యమైన యాంగ్లవత్సరమా! స్వాగతాంజలు లివె భావము- గణితస్వరము- (1) [45x45] (2) [9x9]X[5x5] (3) [40x40]+[20x20]+[5x5] (4) [1x1x1]+[2x2x2]+[3x3x3]+……..+[9x9x9] కవనస్వరము- (1) మానవు లందఱు ఒకే జాతి (2) బుద్ధి, సిద్ధి ఒకదానిని ఒకటి ఎక్కువచేయుట (3) బాగా పెరిగిన ఉత్పాదనలు, విక్రయాలు మఱియు సంపాదనలు కలిసి (4) ప్రారంభము నుండి క్రొత్త గొప్పతనాల సాంగత్యము [ఈ కవితలో ‘వర్గము’ మఱియు ‘ఘనము’ అనే పదాలు ద్వ్యర్థిపదాలుగా ప్రయోగింపబడ్డాయి]
అద్భుతమైన వర్ణన,వివరణ.గణితమును, ప్రస్తుత స్థితి నుంచి తెలియజేశారు.