౧౧౭౧. చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదు...
౧౧౭౨. చెడినప్పుడు స్నేహితుణ్ణి ఆశ్రయించడం మేలు.
౧౧౭౩. చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం...
౧౧౭౪. చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు ...
౧౧౭౫. చెడ్డావా, అయ్యో! పాపం- అని నిట్టూర్చేవారే గాని, చేతిలో గవ్వ పెట్టేవారు లేరు కదా ...
౧౧౭౬. చెప్పుకింది తేలు చేష్టలుడిగి పడి ఉంటుంది.
౧౧౭౭. చెప్పడం కాదు, చేసి చూపించు...
౧౧౭౮. చెప్పేవాడు, చేదస్తుడైనా, వినేవాడు వివేకి ఐతే ఫరవాలేదు....
౧౧౭౯. చేసిన చేష్టల్ని ఎవరూ చూడలేదు గాని, కోసిన ముక్కుని మాత్రం అంతా చూశారు.
౧౧౮౦. చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి.
౧౧౮౧. చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా!
౧౧౮౨. చేసేది యాజమాన్యం, అడిగేది తిరిపెం; అది ఇవ్వకుంటే కోపం...
౧౧౮౩. చేసేవి గంగా స్నానాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు...
౧౧౮౪. చేసేవన్నీ లోపాలు, చక్కదిద్దబోతే కోపాలు ...
౧౧౮౫. చేతిరాత బాగుంది కదాని నుదుటిరాత కూడా బాగుంటుందని అనుకో కూడదు.
౧౧౮౬. "ఛీ, కుక్కా" అంటే, "ఏమిటి అక్కా" అందిట మాటలు నేర్చిన కుక్క!
౧౧౮౭. జనవాక్యమే కర్తవ్యమ్!
౧౧౮౮. జన్మానికి ఒక్క శివరాత్రి...
౧౧౮౯. జమ్మి ఆకుతో విస్తళ్ళు ఔతాయా?
౧౧౯౦. జరుగుబాటు ఉంటే జ్వరమంత సుఖం లేదు.
౧౧౯౧. జలుబుకి, మందు వాడితే వారంలో తగ్గిపోతుంది, మందు వాడకుంటే ఏడురోజులు పడుతుంది...
౧౧౯౨. జాతి నాగుల్ని చంపుతూ, ప్రతిమ నాగుల్ని పూజిస్తున్నట్లు ...
౧౧౯౩. జాతికుక్క మొరగదు, కరుస్తుంది.
౧౧౯౪. జింకకు కొమ్ములు బరువుకావు.
౧౧౯౫. జిహ్వ కొక రుచి, పుర్రె కొక బుద్ధి...
౧౧౯౬. జీతం బత్తెం లేకపోయినా, తోడేలు గొర్రెల్ని కాస్తానందిట!
౧౧౯౭. జీవరత్నాన్ని ఇత్తడిలో పోదిగినా దాని ప్రకాశం ఏమాత్రం తగ్గదు.
౧౧౯౮. జీలకర్ర కర్ర కాదు.
౧౧౯౯. నేతి బీరకాయల్లో నెయ్యుండదు.
౧౨౦౦. జుట్టునుబట్టి ఉంటుంది జడ...