

గుండె గొంతుకలు….
జీవితమంటే ఎన్నో బదిలీలు
ఊహించని మరెన్నో మజిలీలు
ఈ గమనంలో, సుదీర్ఘ పయనంలో
ఎందరితోనో పరిచయం, పరిభాషణం
కొందరే మన మనసును మురిపిస్తారు
మదిలోతుల్లో తమను తాము ముద్రిస్తారు
వారితో స్నేహరాగాలు, ఆత్మీయ గీతాలు
తమంతకు తామే పెనవేసుకు పోతాయి
విడదీయలేనంతగా బంధమల్లుకుపోతాయి
బాహ్యంగా ఒకరికొకరు దూరంగా ఉన్ననూ
గుండె గొంతుకలు మాట్లాడుతుంటాయి