ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
కొన్ని సినిమాలలోని పాటలలో భావానికి, సన్నివేశానికి ఎంతో సాన్నిహిత్యం ఉండి తద్వారా మంచి సందేశాన్ని ఆ చిత్రాన్ని వీక్షించే సగటు ప్రేక్షకుడికి అందించడం జరుగుతుంది. కనుకనే ఆ పాటను వ్రాసే రచయిత ఆ పాటకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులకు, ఆ పాటను అతి మధురంగా ఆలపించిన గాయకులకు కూడా ఎంతో విలువ, ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అటువంటి పాటలు ఎప్పుడూ అందరి నోటా వినబడుతుంటాయి. ముఖ్యంగా పాత చిత్రాలలో ఎన్నో ఆణిముత్యాలు మనకు తారసపడతాయి. ముఖ్యంగా భక్తిరస ప్రధాన చిత్రాలలోని పాటలు మనకు ఎప్పుడూ వినబడుతుంటూనే ఉంటాయి. అటువంటిదే భక్తతుకారం చిత్రంలోని ఈ ‘ఘనాఘన సుందరా..’ పాట. ఈ పాట ఘంటసాల మాస్టారి గాత్రంతో తడిసి మరింత శోభను సంతరించుకొంది. మీకోసం నేటి మన సిరిమల్లె సంచికలో...
చిత్రం: భక్త తుకారాం
సంగీతం: ఆదినారాయణరావు
గేయ రచయిత: దేవులపల్లి
గానం: ఘంటసాల
పల్లవి:
హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం 1:
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం 2:
గిరులూ ఝరులూ విరులూ తరులూ...నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ…నిరతము నీ పాద ధ్యానమే...
నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా...
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...