Menu Close
Geethanjali-page-title

13

THE song that I came to sing remains unsung to this day.

I have spent my days in stringing and in unstringing my instrument. The time has not come true, the words have not been rightly set; only there is the agony of wishing in my heart.

The blossom has not opened; only the wind is sighing by.

I have not seen his face, nor have I listened to his voice; only I have heard his gentle footsteps from the road before my house.

The livelong day has passed in spreading his seat on the floor; but the lamp has not been lit and I cannot ask him into my house.

I live in the hope of meeting with him; but this meeting is not yet.

సీ. మనసునూగెడు పాట వినిపించనేలేదు
నేటి వరకు స్వామి‌నీదు యెదుట

పల్లవే సరిపోదు పదములే చిక్కవు
తీవెలన్ సరిజేయ దినము గడచె

హృదయవేదన పెంచి కదిలె సమీరమ్ము
వికసించనే లేదు విరుల వనము

పలుకువిన్నదిలేదు వదనమ్ము గనలేదు
కాలిసవ్వడి వింటి గడప ముందు

ఆ. సంధ్యవేళ దాటె సమకూర్చ పీఠమ్ము,
దీపమొదవ లేదు దేవ!! నీకు!!
ఎటుల పిలుతు నిన్ను ఇంటిలోనికిపుడు!
నిన్నుగలియు నాశ నిలిచి యుంటి!

14

MY desires are many and my cry is pitiful, but ever didst thou save me by hard refusals; and this strong mercy has been wrought into my life through and through.

Day by day thou art making me worthy of the simple, great gifts that thou gavest to me unasked - this sky and the light, this body and the life and the mind - saving me from perils of overmuch desire.

There are times when I languidly linger and times when I awaken and hurry in search of
my goal; but cruelly thou hidest thyself from before me.

Day by day thou art making me worthy of thy full acceptance by refusing me ever and saving me from perils of weak, uncertain desire.

సీ. అంతునెరుగవు నిన్నడుగు కోర్కెలు, వాని
నిరసించి రక్షింతు నిరతమీవు!!

అడుగకనే యిత్తువర్హునిగా జేసి,
వేలకాంతుల నింగి, విరుల వనము!!

తనువు, మనసు, బుద్ధి దయతోడ సమకూర్చి
విషయవాంఛల వలను విరిచెదీవు

వడిగ పరుగుదీతు, ప్రభు! ,  నిన్ను వెదుకంగ
కనుగప్పి దాగేవు కరుణ మాని

 ఆ. దిన దినమ్ము నన్ను తీర్చిదిద్దుచు నాకు
లావు నిచ్చెదవు నిరాకరించి
సార రహిత‌మైన స్వార్థమ్ము పరిమార్చి
పాత్రతిత్తు వోయి పరమ‌ కృపతొ!!

15

I AM here to sing thee songs. In this hall of thine I have a corner seat. In thy world I have no work to do; my useless life can only break out in tunes without a purpose.

When the hour strikes for thy silent worship at dark temple of midnight, command me, my master, to stand before thee to sing. When in the morning air the golden harp is tuned, honour me, commanding my presence.

సీ. ఆలపించగ పాట అరుదెంచితిని ప్రభూ!
ఒకమూల కూర్చుండి ఊరకుంటి!!

గాంధర్వమున పట్టుగల గాయకులమధ్య,
వినిపించగా లేను వెఱ్ఱి పాట!!

అర్థరాత్రి ఘడియ, అడవి కోవెల లోన,
ఏకాంత ముగ నీదు ఎదుట నిలుతు!!

ఆనతివ్వుము ప్రభూ! గానమ్ము సేయగా!
నిదురదేలుచు నుండ నిఖిల జగము!!

ఆ. సుప్రభాత వేళ శుకపికములు జేయు,
కలరవముల నడుమ కరగి పోయి,
అపుడు యిత్తు నేను ఆనందముప్పొంగ
హృదయ గీతి నీదు పదములందు

16

I HAVE had my invitation to this world's festival, and thus my life has been blessed. My eyes have seen and my ears have heard.

It was my part at this feast to play upon my instrument, and I have done all I could.

Now, I ask, has the time come at last when I may go in and see thy face and offer thee my silent salutation?

విశ్వగాన సభకు పిలుపునందెను నేడు,
బ్రతుకు ధన్యమయ్యె వరము బడసి !!
వేడుకలను గంటి వింటినెల్లరుపాడ,
వాద్యకరుని నాదు పాత్ర ముగిసె!!

యిపుడు వేచి యుంటి ఏకాంత సేవకై,
సమయ మిదియొ కాదొ సముఖమునకు?
తనివితీర జూచి తరలిపోదును స్వామి,
కరుణనాజ్ఞ నిమ్ము తెరను తీయ!!

17

I AM only waiting for love to give myself up at last into his hands. That is why it is so late and why I have been guilty of such omissions.

They come with their laws and their codes to bind me fast; but I evade them ever, for I am only waiting for love to give myself up at last into his hands. People blame me and call me heedless; I doubt not they are right in their blame.

The market day is over and work is all done for the busy. Those who came to call me in vain have gone back in anger. I am only waiting for love to give myself up at last into his hands.

సీ. వేచియుంటినిచట ప్రేమ కొరకు, నన్ను
అర్పించుకొనుటకై అతని మ్రోల!

ఆలస్య కారణమ్మందు కొరకె, నాదు
తప్పిదమ్ములు యన్ని దాని కొరకె!

పట్టిబంధింతురు పలుశాసనములతో,
దక్కియందునువాని చిక్కు బడక !!

నియమరహితుడంచు నిందించు లోకమ్ము
తరచిజూచిన వారి తప్పులేదు

ఆ. వెలిసిపోయె హోరు విపణివీథిని, వేగి-
యేగిరంత నన్ను ఎరుగు వారు
అర్పణమ్ము జేయ అతనికరములందు
వేచియింటి నేను ప్రేమ కొరకు !!!

18

CLOUDS heap upon clouds and it darkens. Ah, love, why dost thou let me wait outside at the door all alone?

In the busy moments of the noontide work I am with the crowd, but on this dark lonely day it is only for thee that I hope.

If thou showest me not thy face, if thou leavest me wholly aside, I know not how I am to pass these long, rainy hours.

I keep gazing on the far away gloom of the sky, and my heart wanders wailing with the restless wind.

సీ. నీలిమేఘపు ఛాయ నింగియంతట నిండె,
చీకటి రేఖలు చిక్కనయ్యె!!

వాకిట నిలబడి ఏకాకినై యుంటి,
యేలనోయీ ప్రియా జాలమింత!!

జనుల సందడిలోన దినమెటులో నేను,
కార్యమగ్నునగుచు గడుపుకొందు!

ముసురు మబ్బులు నిండు మసక చీకటి లోన,
మనసు నిన్నేకోరు మరల మరల!

ఆ. వానవేళ నీదు వదనమ్ము కనలేక,
ఎటుల మనుటొ నేను ఎరుగనోయి!
గాలితెరల గూడి కదలిపోవు మనసు,
నిలచి జూతు క్రుంగు నింగి వంక!!!

19

IF thou speakest not I will fill my heart with thy silence and endure it.

I will keep still and wait like the night with starry vigil and its head bent low with patience.

The morning will surely come, the darkness will vanish, and thy voice pour down in golden streams breaking through the sky.

Then thy words will take wing in songs from every one of my birds' nests, and thy melodies will break forth in flowers in all my forest groves.

సీ. మాట మానెదవేని, మదిని నీ మౌనమ్ము
నిలిపికొందును స్వామి!  పలుకు మాని!!

నడిరేయి నక్షత్ర నయనాల నింగినై
తలవంచి నిలిచుందు తాల్మి గొనుచు
---
అంధకారము నంతమొందించి, ప్రభలతో
ఉదయకాంతులు నిండు ఉర్వియందు

గగనాల భేదించి, కనకధారగ పారు
నీదు సంగీతమ్ము నిఖిలమంత!!

ఆ. పదములన్ని చేరి, పక్షి రెక్కల పైన,
మధుర గానమగుచు మారు మ్రోగు!!
గాలిలోన దేలు, గాన మాధుర్యమ్ము
మురిసి నవ్వు నాదు విరుల వనము!!!

20

ON the day when the lotus bloomed, alas, my mind was straying, and I knew it not. My basket was empty and the flower remained unheeded.

Only now and again a sadness fell upon me, and I started up from my dream and felt a sweet trace of a strange fragrance in the south wind.

That vague sweetness made my heart ache with longing and it seemed to me that it was the eager breath of the summer seeking for its completion.

I knew not then that it was so near, that it was mine, and that this perfect sweetness had blossomed in the depth of my own heart.

సీ. వికసించె కమలమ్ము, ఒకనాటి ఉదయమ్ము,
మతిమాలి కననైతి మరపునుండి!!!!

వట్టిదౌ పూసజ్జ  పట్టి తిరుగుచుంటి,
ఎదుటనున్న సుమము వదలివైచి!!!

కలతనిదుర లోన కలనుండి మేల్కొంటి,
మలయ సమీరమ్ము పలకరింప,

హృదయవేదన పెంచు మధురగంధము తోచె,
ఉద్విగ్న గ్రీష్మంపు ఊపిరులుగ!!

ఆ. ఎచట నుంచి వచ్చెనీ సుగంధమ్మని
ఎరుగ నైతినపుడు ఎఱుక లేక!!!
ఇపుడు తెలిసికొంటి ఎదలోతులన్ పూచు
సౌమనస్య కలిత సౌరభముగ

Posted in June 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!