Menu Close
Geethanjali-page-title

3

I KNOW not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky.

The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.
My heart longs to join in thy song, but vainly struggles for a voice.

I would speak, but speech breaks not into song, and I cry out baffled.

Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

సీ. ఎటుల పాడెదవు నీవెరుగనైతిని ప్రభూ!
అటులె విందు, కనులనప్పగించి!!!

విశ్వమంతయు నింపు వెలుగుతో నీపాట!
గగనమ్ముల కల్పు, గాన ఫణితి!

గండశిలల తొలిచి, గంగయై పారు, నీ
సంగీత సరితలీ సకల భువిని!

కోరుకొందును, ప్రభూ, గొంతుకల్పగ నీతొ,
శుష్కమైన గళము, సుంత రాదు!!

ఆ. పాట పాడ దలతు, పలువిధమ్ముల, కాని
పెదవి నుండి పెగలు పేద ధ్వనులె!!
కట్టి వైచె నిటుల కమనీయగానమ్ము
పట్టుబడితి, స్వామి! పరవశమున!!

4

LIFE of my life,

I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.
And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

నాలోని ప్రాణమా!!

సీ. నామేని గంధమై, నను వీడవనుచు, నా
దేహమ్మునుంతు నీ దేవళముగ!!

సత్యమ్ము నీవని, జ్ఞానదీప్తుడవనీ
బొంకు చేరక జూతు బుద్ధిలోన!

హృదయ పీఠము నేలు సదయుండవని యెంచి
చేరనీయనెపుడు చెడు తలపుల

నీ పాదముల చెంత నిలచు పుష్పము వలె,
మలిన రహితముగా, మనసునుంతు

ఆ. నిన్ను తెలియ జేతు, నన్ని కర్మలయందు
కర్మజేయు బలము గరిపెదీవె
కార్య కారణముల కర్తవీవె, ప్రభూ
అన్ని నీవె స్వామి అంత నీవె!

5

I ASK for a moment's indulgence to sit by thy side. The works that I have in hand I will finish afterwards.

Away from the sight of thy face my heart knows no rest nor respite, and my work becomes an endless toil in a shoreless sea of toil. To-day the summer has come at my window with its sighs and murmurs; and the bees are plying their minstrelsy at the court of the flowering grove.

Now it is time to sit quiet, face to face with thee, and to sing dedication of life in this silent‌ and overflowing leisure.

సీ. కరువు తీరగ ఒక, క్షణము నీమ్రోల, నే
గడుపుకోరిక నేడు, అడిగెదోయి!

లోక వ్యాజ్యములను చేకొనెద పిదప,
దర్శనమ్మును జేసి, తనివితీర!

నిన్ను చూడని నాడు, నిలవలేదు మనం
బవధిలేని శ్రమలె, అనుదినమ్ము

కొలువుదీరె విరులు కలగానము వినగ
బృందగానముసేయ భృంగ తతులు

ఆ. సమయమిదియె! నీదు, సముఖమ్మున నిలిచి,
ఎదను మెదలు భావ మెరుక జేయ
ఎవరు లేని చోట ఏకాంతమందు, నా
హృదయ గీతి వినుము మదిని స్వామి!

6

PLUCK this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust.

It may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it.

I fear lest the day end before I am aware, and the time of offering go by.

Though its colour be not deep and its smell be faint, use this flower in thy service and pluck it while there is time.

సీ. చిన్నిపూవే యిది చేకొనుము త్వరగా
మట్టి లోన బడిన వట్టిదౌను!

జాగుసేయకు స్వామి సమయమెంతయొ లేదు
మాసిపోక మునుపె కోసికొనుము!

కంఠమాలిక నుండ కలదొ లేదో ప్రాప్తి
చేతద్రుంచిన చాలు ప్రీతి బడయు!

కనుగప్పి కాలమ్ము కరగిపోవ దొడగె
అర్పించుకొనువేళ నందగలనొ?

వన్నె తరిగి కొంత వడలెనేమో! దీని,
సౌరభమ్ము సుంత సడలె‌నేమొ!
అసువులారు మునుపె అందుకొనుము స్వామి!
వరమునిమ్ము స్వామి కరుణతోడ!!!

7

MY song has put off her adornments. She has no pride of dress and decoration.

Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet.

Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

సీ. మెరుపుహంగులు వీడి, మేన భూషలు మాని
నిను మరుగుపరచు, నిధుల విడచి,

నిజరూపమున నిల్చె నీమ్రోల నాపాట
అతిశయమ్ము గొలుపు అన్ని వీడి!!

కంకణ క్వణనమ్ము కలిగించు నవరోధ
మొంటిగా నా తోడ ఊసులాడ!!

మాట మరతు నీదు పాట వినుచు స్వామి,
గర్వమణగి పోవు కవిగ నాకు!!

ఆ. చేరి నీ పదముల కూరుచుంటిని స్వామి,
అడవి వెదురు వోలె అణగి మణగి!
అధర సుధలు నింపి ఆలపించగదోయి,
మధుర గీతములను మనసు నిండ!

Posted in April 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!