Menu Close
mg

ఎవరే ....

2016 లొ విడుదలై మంచి ప్రజాదరణను పొందిన "ప్రేమం" చిత్రం నుండి ఎంతో ప్రాచుర్యం సంతరించుకొన్న "ఎవరే..." పాటను మన సిరిమల్లె మార్చి సంచికలో మీకు అందిస్తున్నాము.

ఈ పాటను శ్రీమణి గారు రచించి, రాజేష్ మురుగేశన్ గారు స్వర పరిచగా, విజయ్ ఏసుదాస్ గారు ఎంతో హృద్యంగా ఆలపించారు.

మన సిరిమల్లె కోసం చి. చైత్రిక బుడమగుంట ఈ పాటను పాడడం జరిగింది. విని, పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.

తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే ....
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే .... ఈ హాయికి హృదయము చాలంది

ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియతియ్యని నిమిషాలే నీలోన ఒంపే నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు
నా ప్రాణమే నీకు చెపుతోంది ఇపుడు నువు లేక నే లేనని
గది లాంటి మదిలో నది లాంటి నిన్నే దాచేయ్యాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైన నా ఊపిరి చిరునామ తెలిపేదెవరే
ఎవరే ......

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడచిన బాటే
ప్రాణాలే తీస్తూందే నీ ఊహల తోటే
నా మనసే నీదయ్యే వినదే నా మాటే
ఎవరే ....
ఎవరే ప్రేమను మాయంది
ఎవరే .... ఈ హాయికి హృదయము చాలంది

Posted in March 2021, పాటలు