Menu Close

మన్మథా... నవ మన్మథా...

- డా. రావి రంగారావు -

దేవతల కందని అమృతం

ఒరే తాగుబోతులారా,
మనవడి ముద్దును మించిన
మత్తెక్క డుందిరా!

ఒరే ధూమ పాన ప్రియులారా,
మనవడి మాటల కన్న
కైపెక్క డుందిరా...

ఒరే జూదం ప్రేమికులారా,
మనవడి ఆటల కన్న
గొప్ప వినోదం ఎక్కడుందిరా!

ఒరే పిచ్చి పిచ్చి వ్యసనాల పామరులారా,
భూలోకంలో ఆరోగ్య రహస్యం,
అనంత ఆనందం అందించే
దేవతల అమృతం కన్న గొప్ప అమృతం
మనవడి కౌగిలిలోనే దొరుకుతుంది…
తాతల కొక్కరికే ఇది అందుతుంది…

Posted in May 2019, బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *