Menu Close
Samudraala Harikrishna
చిత్ర వ్యాఖ్య
సముద్రాల హరికృష్ణ

కరుణాలయ!!

karunalaya

కనుల కరుణ వర్షించు సాధు జీవులు,
మునుల వోలె అర్ధ నిమీలిత నేత్రలై
ధ్యానముద్ర నుండు పర హితైకమనస్క
గుణ క్షీరనిధులు,గోవుల నాదరించరే!!

వన హంస!

vana-hamsa

దళముల,విరుల,నందముగ నొదిగి
పాల వెలుగుల అరదమా రాజహంస
నుల్లసించె, చెలి, వన రమ,రమ్యవని,
పల్కుల తల్లి,సల్లాపార్థము,విచ్చేయన్!!


శివాత్మకం!!

sivatmakam

ఢమ ఢమ ఢమ ఢమరుకమ్మె మ్రోగించెనా/
ఉమతో నాడిన సాంధ్య నట న్మాహేశ్వరుడు/
ఇమ్ముగ నోంకారమ్మై దివి, వాఙ్మయ సూత్రుల/
ఇమ్మహి బోరు చెలగ, శాబ్దిక ప్రభలన్ !!

రేఖ!!

rekha

నాడు - లక్ష్మణ రేఖ:

మరిది గీసెను రేఖ,రాకమ్మ వదిన,దాటి యనుచు
సొరిది తప్పుచు,పరుసములాడి,పంపితి వాతని
తరుముకొచ్చెను దుర్విధి రావణ కాఱు మొయిలై
ఇఱ్రిపైనాశ,నైరుతి నట్టింటికినిప్పులనినుద్రోయన్

నేడు - లాక్డౌన్ రేఖ!

చెరిపి గీతలన్ని,మ్రింగినవాని లెక్క,నీకేతెలియదు
సర్పమునకు కప్ప,కప్ప కోగిరము కీటకముదానికి
చిరుక్రిమివేరొకటి,ప్రకృతికట్టుబాటిదిభగ్నముచేసి
అరచేతనసువులనున్నావుతెలిసెనోరేఖమహిమ

Posted in January 2025, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!